ట్రంప్‌పై వ్యాఖ్యలు.. సభలో నవ్వులు: క్షమాపణలు చెప్పిన కమలా హరిస్

భారత సంతతి సెనేటర్, డెమొక్రాట్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న కమలా హరిస్.దేశాధ్యక్షుడు ట్రంప్‌కి క్షమాపణలు చెప్పారు.

 Senator Kamalaharris Apologizes For Video Of Her Laughing At Rallygoer-TeluguStop.com

గత శుక్రవారం న్యూహాంప్‌షైర్‌ టౌన్‌హాల్‌లో జరిగిన సమావేశంలో ఒక వ్యక్తి.అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక మానసిక వికలాంగుడి చేష్టలులా ఉన్నాయంటూ నినాదాలు చేసినట్లు.

అందుకు ఆమె నవ్వినట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీనిపై నెటిజన్లు కమలా హరిస్‌ను ట్రోల్ చేయడంతో ఆమె స్పందించారు.

ఈ మేరకు శనివారం ఒక ట్వీట్ చేసిన ఆమె.తాను ఆ వ్యక్తి చేసిన నినాదాలను వినలేదని.ఒక వేళ తన ప్రవర్తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే… తనను క్షమించాలని కోరారు.అటువంటి పదాలు ఆహ్వానించదగ్గవి కాదంటూ కమల వ్యాఖ్యానించారు.కాగా.ట్రంప్‌పై వ్యాఖ్యలు చేసిన వ్యక్తి భారతదేశానికి చెందిన వాడినని.

కమలా హరీస్ తల్లి స్వస్థలం చెన్నైకి నుంచి వచ్చినట్లు తెలిపాడు.

Telugu Kamala Harris, Donald Trump, Rallygoer-

 

అమెరికన్ల కలను నిజం చేయడానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సదరు సమావేశంలో చెప్పాడు.నిలువెల్లా జాత్యహంకారం నిండిన ఓ వ్యక్తి అమెరికాలో ఉన్నాడని.అతని రంగు కాకుండా మరో రంగు వారు ఈతనికి ఎదురుపడితే.

వెంటనే అమెరికా వదిలి వెళ్లిపోవాలంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడని సదరు వ్యక్తి ట్రంప్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు.ఈ దేశం గురించి తాను భయపడుతున్నానని చెప్పాడు.ఈ సమయంలో హాల్‌లో ఉన్న వాళ్లందరూ చప్పట్లు, కేకలతో ఆ వ్యక్తి వ్యాఖ్యలను సమర్థించారు.ఇదే సమయంలో కమలా హారిస్ కూడా చిరు నవ్వు చిందిస్తూ.

బాగా చెప్పావంటూ మెచ్చుకోవడం సంచలనం కలిగించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube