టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా నేడే విడుదల అయ్యింది.మహేష్‌బాబు నటించిన సినిమా మొదటి సారి తెలుగు మరియు తమిళంలో విడుదల అవ్వడంతో అందరి దృష్టి తమిళ వర్షన్‌పై ఉంది.
తెలుగులో సూపర్ హిట్ అయిన ‘శ్రీమంతుడు’ తమిళ టాక్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తమిళంలో ‘సెల్వంధన్’గా విడుదలైన ఈ సినిమాకు అక్కడి ప్రేక్షకులు సైతం ఘన స్వాగతం పలుకుతున్నారు.
ఒక యూనివర్శిల్ సబ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తమిళ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటుంది.మహేష్‌బాబు ఎంట్రీ సినిమాతోనే తమిళంలో మంచి కలెక్షన్స్‌ను రాబట్టడం ఖాయంగా ఉంది.
ఈ సినిమాలో నటించిన శృతిహాసన్ మరియు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌లు తమిళ ఆడియన్స్‌కు పరిచయం ఉన్న వారు కావడంతో సినిమా మంచి ఆధరణ దక్కించుకుంటుంది.