విడ్డూరం : ఆ బీచ్‌లో సెల్ఫీలు తీసుకుంటే మరణ శిక్ష  

Selfies At Phuket Island In Thailand Is Death Penalty-selfies At Phuket Island,telugu Viral News,viral In Social Media,ఆ బీచ్‌లో సెల్ఫీలు తీసుకుంటే మరణ శిక్ష,ఫూకెట్‌ ఐలాండ్‌

ఈమద్య కాలంలో సెల్ఫీల పిచ్చి పీక్స్‌కు వెళ్లింది. ఎక్కడకు వెళ్లినా, ఏం చేసినా కూడా సెల్ఫీలు తీసుకోవడం, వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం. సెల్ఫీలు, ఫొటోలు సోషల్‌ మీడియాకు కుదిపేస్తున్నాయి..

విడ్డూరం : ఆ బీచ్‌లో సెల్ఫీలు తీసుకుంటే మరణ శిక్ష-Selfies At Phuket Island In Thailand Is Death Penalty

ముఖ్యంగా ఏదైనా పర్యాటక ప్రాంతంకు వెళ్లినా, లేదా ఏదైనా బీచ్‌కు వెళ్లినా కూడా అక్కడ తప్పకుండా, ఖచ్చితంగా ఫొటోలు దిగి తీరుతారు. అయితే థాయిలాండ్‌లోని ఒక బీచ్‌లో మాత్రం ఫొటోలు పూర్తిగా బ్యాన్‌. కేవలం బ్యాన్‌ మాత్రమే కాదు, ఒక వేళ అక్కడ ఫొటోలు దిగితే ఏకంగా ఉరి శిక్ష విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించుకుంది.

థాయిలాండ్‌లోని ఫూకెట్‌ ఐలాండ్‌ ఉంది. అందులో మాయ్‌ ఖావో అనే ఒక బీచ్‌ ఉంటుంది. ఆ బీచ్‌కు దగ్గరగా ఫూకెట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటుంది. ఆ విమానాశ్రయం నుండి గంట గంటలకు విమాన రాకపోకలు జరుగుతూ ఉంటాయి.

విమానాలు వెళ్లే సమయంలో బీచ్‌లో ఉన్న వారికి చాలా దగ్గరగా వెళ్తున్నట్లుగా అనిపిస్తాయి. విమానాలు నెత్తిపై నుండి వెళ్తున్నట్లుగా, ఎగిరితే చేతికి అందే విధంగా విమానాలు వెళ్తూ ఉంటాయి. దాంతో ఆ విమానాలు వచ్చే సమయంలో సెల్ఫీలు తీసుకునేందుకు వందలాది మంది వచ్చే వారు..

సెల్ఫీలు తీసుకోవడం వల్ల పర్యావరణం నాశనం అవ్వడంతో పాటు, విమానాలకు ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందని, సెల్ఫీ పేరుతో దగ్గరగా వచ్చిన సమయంలో విమానాలను పేల్చేసే అవకాశాలు కూడా ఉంటాయనే ఆందోళనతో అక్కడి ప్రభుత్వం ప్రయాణికుల భద్రత రీత్యా ఆ బీచ్‌లో సెల్ఫీలు తీసుకోవడం నిషేదించడం జరిగింది. సెల్ఫీల నిషేదంను పదే పదే ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో సెల్ఫీలు తీసుకుంటూ రెండు సార్లు పట్టుబడితే లక్ష డాలర్ల జరిమానాతో పాటు ఉరిశిక్ష కూడా విధించనున్నారు. స్థానికంగా ఈ చట్టం తీవ్ర వ్యతిరేకతను తీసుకు వచ్చింది. అయినా కూడా ప్రభుత్వం మాత్రం సెల్ఫీలను బ్యాన్‌ చేసే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.