ఒక్క సెల్ఫీ.. ఐదుగురిని పొట్టనబెట్టుకుంది..?  

Selfie obsession leads to death by drowning of five men in maharashtra, selfie, Selfie leads to death, maharashtra - Telugu Maharashtra, Selfie, Selfie Leads To Death, Selfie Obsession Leads To Death By Drowning Of Five Men In Maharashtra

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో సెల్ఫీ పిచ్చి ఎక్కువ అయిపోతుందన్న విషయం తెలిసిందే.అతి తక్కువ ధరలకే మంచి కెమెరా ఉన్న మొబైల్ లు ప్రస్తుతం అందుబాటులో ఉండడంతో… ప్రతి చిన్న విషయాన్ని కూడా సెల్ఫీలు బంధించడానికి ఆసక్తి చూపుతున్నారు నేటితరం జనాలు.

 Selfie Five Members Maharshtra

అయితే కొన్ని కొన్ని సార్లు సెల్ఫీ మోజు కాస్త ప్రాణాల మీదికి తెచ్చిన సంఘటనలు కూడా ఎన్నో చూసాం.

ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది.

ఒక్క సెల్ఫీ.. ఐదుగురిని పొట్టనబెట్టుకుంది..-General-Telugu-Telugu Tollywood Photo Image

సెల్ఫీ మోజు ఏకంగా ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది.జలపాతం దగ్గర సరదాగా సెల్ఫీ తీసుకుందామని ప్రయత్నించి ఐదుగురు జలపాతంలో పడి ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలోని పాల్గడ్ జిల్లా జవహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది, జవహార్ ప్రాంతంలో ఉన్న కాల్వండి జలపాతానికి 13 మంది సరదాగా వెళ్లారు.

సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి ఇద్దరు వ్యక్తులు జలపాతంలో జారి పడ్డారు.

వారిని రక్షించేందుకు మరికొందరు దూకారు.నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో మొత్తం ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అందించడంతో కొంత ప్రాణాలను రక్షించ గలిగారు.చనిపోయినవారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

#Maharashtra #Selfie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Selfie Five Members Maharshtra Related Telugu News,Photos/Pics,Images..