అమ్మాయిలను ఆరకంగా పడేయటం కష్టం

ఒక అమ్మాయి అంటే మీకు బాగా ఇష్టం.మీ దృష్టిలో మీరు తనకి అన్ని విధాలుగా అర్హులు.

 Self Obsession Will Make Your Crush Feel Bore-TeluguStop.com

నా గుణం ఇది, నా పద్ధతులు ఇవి, నా జీతం ఇంత, నా బాస్ ఇలా పొగిడాడు, నా వెంట ఇంతమంది అమ్మాయిలు పడుతున్నారు, నేను ఇది చేశాను, అది చేశాను అని తెగ గొప్పలు చెప్పుకుంటున్నా అమ్మాయి పడట్లేదా? ఎందుకు పడుతుంది రోజంతా మీ డబ్బా కొట్టుకుంటే.

ఒక్కసారి చెప్పుకుంటే చాలు కాని రోజూ మీ డబ్బా మీరు కొట్టుకుంటే పడిపోవడానికి మీరేమి సినిమా హీరో కాదు కదా.అమ్మాయిలతో కబుర్లు పెట్టే సమయం చాలా తక్కువగా దొరుకుతుంది.దొరికిన సమయంలో ఎంత కుదిరితే అంతవరకు నవ్వించాలి.

తనకు టైమ్ పాస్ అయ్యేలా మాట్లాడాలి.అది వదలేసి మీ డబ్బా మీరే కొట్టుకుంటే ఒకరోజు వింటారు, రెండు రోజులు వింటారు.

ఆ తరువాత విసుక్కుంటారు.బయటకి చెప్పకపోయినా, వీడు మాట్లాడటం ఎప్పుడు మానేస్తాడురా బాబు అని అనుకుంటూ ఉంటారు.

అందుకే మిమ్మల్ని మీరు పొగుడుకోవడం మానేసి, ఆ అమ్మాయిని పొగడండి, కాస్త నవ్వుతుంది.మీ అమాయకత్వాన్ని కూడా సరదాగా చూపించండి, తనకి క్యూట్ గా అనిపిస్తుంది.

అన్నిటి మధ్యలో కాస్తంత మీ డబ్బా కొట్టుకోవడం ఇరికిస్తే జరిగే నష్టమేమీ లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube