సింగర్ ముఖాన్ని వాడుకున్నందుకు 70 కోట్లు జరిమానా...

అమెరికా దేశానికి చెందినటువంటి పాప్ సింగర్ సెలీనా గోమెజ్ పాటలకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.అంతేగాక ఇటీవల కాలంలో ఈ అమ్మడు కంపోజ్ చేసినటువంటి లూస్ యు టూ లవ్ మీ అనే పాట మంచి ప్రాచుర్యం పొందింది.

 Selena Gomez, Pop Singer,  70 Crores Fine, Hollywood Singer,-TeluguStop.com

అయితే ఈ మధ్యకాలంలో కొందరు సెలబ్రిటీలకు ఉన్నటువంటి ఫేమ్ ని ఉపయోగించుకొని పాపులర్ కావాలని చూస్తుంటారు.అలాగే ఓ ప్రముఖ గేమ్ డిజైనింగ్ సంస్థ సింగర్ సెలెనా గోమెజ్ అనుమతి లేకుండా తన ఫోటో  ఉపయోగించుకున్నందుకుగానూ భారీ జరిమానా ఎదుర్కొంది.

వివరాల్లోకి వెళితే అమెరికా దేశానికి చెందిన మొబైల్ ఫ్యాషన్ గేమ్ సంస్థ ఇటీవల తయారు చేసినటువంటి తమ గేమ్ ని ప్రమోట్ చేసుకునేందుకు గానూ సింగర్ సెలీనా గోమెజ్ ఫోటోని వాడుకుంది.దీంతో ఈ ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకుతూ చివరికి సెలెనా గోమెజ్ చెవిన పడింది.

దీంతో ఆమె వెంటనే గేమ్ డిజైనింగ్ సంస్థ అధికారులను సంప్రదించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో తన అనుమతి లేకుండా తన ఫోటోనీ ఉపయోగించుకున్నందుకుగాను, అలాగే అసభ్యకరంగా తన ఫోటోను చిత్రీకరించినందుకుగాను, దాదాపుగా 10 మిలియన్ డాలర్లను చెల్లించాలని పరువు నష్టం దావా వేసింది.

దీంతో ప్రస్తుతం గేమ్ డిజైనింగ్ సంస్థ అధికారులు సెలెనా గోమెజ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.10 మిలియన్ డాలర్లు అంటే మన భారత దేశపు కరెన్సీ లో దాదాపు 70 కోట్ల రూపాయలన్నమాట. మరి సెలెనా గోమెజ్ కి పొరపాటున తన ఫోటోని వాడుకున్నందుకు అంత డబ్బు చెల్లిస్తారో లేక పొరపాటయిందని సర్ది చెబుతారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube