మెగాస్టార్, చరణ్ లతో మరోసారి శేఖర్.. ఈసారి అదిరిపోతుందట!

టాలీవుడ్ లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే చాలా మందికి ఇష్టం.ఈయన స్టెప్పులు కొత్తగా ఉండడమే కాకుండా టఫ్ గా కూడా ఉంటాయి.

 Sekhar Master Sets Another Blockbuster Song With Chiranjeevi And Ram Charan, Ach-TeluguStop.com

పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో శేఖర్ అవకాశాలు ఉండుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.ఇక ఇప్పుడు ఆచార్య సినిమాలో కూడా శేఖర్ తన మార్క్ చూపించ బోతున్నట్టు సమాచారం.

ఆచార్య సినిమా కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్సిద్ధ అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటేరామ్ చరణ్ కు జతగా పూజా హెగ్డే నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయని టీమ్ అధికారికంగా ప్రకటించారు.అయితే ఇటీవలే ఒక పాట షూటింగ్ జరిగిందని సమాచారం.

ఈ పాటలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొన్నాడు.అయితే ఆ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారట.ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు.ఇక ఇప్పుడు వీరి ఇద్దరితో కలిసి అదిరిపోయే సాంగ్ కు కంపోస్ చేసినట్టు సమాచారం.

ఇదంతా శేఖర్ షేర్ చేసిన ఫోటో కారణంగా బయటకు వచ్చింది.తాజాగా శేఖర్ మాస్టర్ చిరు చరణ్ లతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

ఈ సాంగ్ షూట్ సమయంలో దిగిన ఫోటోను శేఖర్ మాస్టర్ షేర్ చేయడంతో పాటు ఇద్దరు మెగాస్టార్స్ తో కలిసి వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.చిరు డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.అసలు టాలీవుడ్ లో డాన్స్ ను పరిచయం చేసిందే చిరు.అలాంటి గ్రేస్ ఉన్న చిరుతో శేఖర్ మాస్టర్ కలిస్తే ఇక మోత మోగిపోవాల్సిందే.

https://www.instagram.com/p/CUBt0LOIMFq/?utm_source=ig_embed&ig_rid=2eb7c923-c32f-4ac9-af2d-399c1959c71f

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube