వాళ్లకు సహాయం చేస్తాను.. గొప్పమనస్సు చాటుకున్న శేఖర్ మాస్టర్..?

కరోనా సెకండ్ వేవ్ వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్న సంగతి తెలిసిందే.లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

 Sekhar Master Providing Groceries To Dancers, Sekhar Master, Covid Pandemic, Sek-TeluguStop.com

కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకొస్తూ ఉండటం గమనార్హం.ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరైన శేఖర్ మాస్టర్ కష్టాల్లో ఉన్న డ్యాన్సర్లను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.
డ్యాన్సర్లకు అవసరమైతే తాను నిత్యావసర సరుకులను అందజేస్తానని శేఖర్ మాస్టర్ తెలిపారు.సోషల్ మీడియా ఖాతాలలో ఒకటైన ఇన్ స్టాగ్రామ్ వేదికగా శేఖర్ మాస్టర్ ఈ మేరకు ప్రకటన చేశారు.

కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల అమలు వల్ల ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉందని శేఖర్ మాస్టర్ అన్నారు.టీవీ షోలలో చేసేవాళ్లకు, గ్రూప్ డ్యాన్సర్లుగా చేసేవాళ్లకు ఉపాధి దొరకడం లేదని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు.
భోజనం కోసం ఇబ్బంది పడుతున్న డ్యాన్సర్లు ఎంతోమంది ఉన్నారని శేఖర్ మాస్టర్ వెల్లడించారు.అలా ఇబ్బందులు పడుతున్న వాళ్లు ఎవరైనా ఉంటే తనను సంప్రదించాలని శేఖర్ మాస్టర్ కోరారు.

తన బృందం ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందిస్తుందని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు.కష్టాల్లో ఉన్న డ్యాన్సర్లు సంప్రదించడం కోసం శేఖర్ మాస్టర్ కొన్ని నంబర్లు ఇచ్చారు.
కరోనా వల్ల ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవని శేఖర్ మాస్టర్ అన్నారు.ప్రజలు ఇంట్లోనే ఉంటూ వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శేఖర్ మాస్టర్ సూచనలు చేశారు.

ఎంతో అవసరమైతే మాత్రమే బయటకు రావాలని శేఖర్ మాస్టర్ కోరారు.మరోవైపు దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి.ఏపీలో ప్రతిరోజూ 20,000కు అటూఇటుగా కరోనా కొత్త కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం.ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube