హీరోగా తెరంగేట్రం చేయనున్న శేఖర్ మాస్టర్

టాలీవుడ్ లో నెంబర్ వన్ డాన్స్ మాస్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న వ్యక్తి శేఖర్ మాస్టర్.ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరి డాన్స్ కి బ్యాగ్రౌండ్ లో ఉండే కీలక వ్యక్తిగా అతనికి మంచి ఐడెంటిటి ఉంది.

 Sekhar Master Plan To Introduce As A Hero-TeluguStop.com

అల్లు అర్జున్ రామ్ చరణ్, తారక్, చిరంజీవి లాంటి స్టార్స్ అందరికి ఎక్కువగా శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆచార్య మూవీకి ఆయనే డాన్స్ కంపోజర్ గా ఉన్నారు.

అలాగే తాజాగా లవ్ స్టొరీ నుంచి వచ్చిన సూపర్ హిట్ సాంగ్ సారంగాదరియాకి కూడా శేఖర్ మాస్టర్ డాన్స్ సమకూర్చారు.ఇదిలా ఉంటే సౌత్ లో డాన్స్ మాస్టర్స్ చాలా మంది తరువాత యాక్టర్స్ గా మారారు.

 Sekhar Master Plan To Introduce As A Hero-హీరోగా తెరంగేట్రం చేయనున్న శేఖర్ మాస్టర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రభుదేవా, లారెన్స్ అయితే ఏకంగా హీరోలు అయిపోయారు.

Telugu Dance Masters, Dil Raju, Lawrence, Prabudeva, Sekhar Master, South Cinema, Tollywood-Movie

అలాగే ఇప్పుడు దర్శకులుగా కూడా మారిపోయారు.ఇదిలా ఉంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా వీరి దారిలోనే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది.ఓ యువ దర్శకుడు శేఖర్ మాస్టర్ తో హీరోగా ఒక కథ సిద్ధం చేసి అతనికి వినిపించారని తెలుస్తుంది.

ఈ కథ నచ్చడంతో అతను కూడా చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బోగట్టా.ఇక దిల్ రాజు ఏకంగా ఈ మూవీని నిర్మించడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతానికి దీనికి సంబందించిన హాట్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.ఇదిలా ఉంటే మరో స్టార్ డాన్స్ మాస్టర్ గా ఉన్న జానీ మాస్టర్ కూడా హీరోగా తెరంగేట్రం చేయబోతున్నట్లు తెలుస్తుంది.

మరి ఇద్దరు స్టార్ డాన్స్ డైరెక్టర్స్ తెరపై నటులుగా ఏ విధంగా సందడి చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

#Sekhar Master #Dance Masters #Dil Raju #Lawrence #Prabudeva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు