ఆన్ స్క్రీన్ పై శేఖర్ మాస్టర్, రష్మీ రొమాన్స్  

Sekhar Master And Rashmi Gowtham Romance On Onscreen -

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ గా దూసుకుపోతున్న వ్యక్తి శేఖర్ మాస్టర్.అతని తక్కువ టైంలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరికీ డాన్స్ కొరియోగ్రాఫ్ చేసే అవకాశాన్ని శేఖర్ మాస్టర్ తెచ్చుకున్నారు.

Sekhar Master And Rashmi Gowtham Romance On Onscreen

మెగా హీరోలకి డాన్స్ అంటే ఫస్ట్ ఛాయస్ శేఖర్ మాస్టర్ ఉంటారు.ఓ విధంగా అతను ప్రభుదేవా, లారెన్స్ తర్వాత ఆ స్థాయిలో టాలీవుడ్ లో తన హవాని ఇతను కొనసాగిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు వాళ్ళ దారిలోనే శేఖర్ మాస్టర్ హీరోగా టర్న్ తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

కొంత మంది దర్శకులు శేఖర్ మాస్టర్ తో డాన్స్ బేస్డ్ సినిమా ప్లాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

ఇక తను హీరోగా హాట్ యాంకర్ రష్మీ హీరోయిన్ గా జోడీ సెట్ చేయబోతున్నారని చెప్పుకుంటున్నారు.ఇక ఢీ షోలో స్టేజి మీద రొమాన్స్ చేసే వీళ్లిద్దరు ఆన్ స్క్రీన్ మీద చేస్తే ఎలా ఉంటుందో చూడాలని వారిని అభిమానించే వారు కూడా కోరుకుంటున్నారు.

అన్ని కుదిరితే 2020లో శేఖర్ మాస్టర్ హీరోగా సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు