మెగా హీరో కోసం కథ సిద్ధం చేస్తున్న శేఖర్ కమ్ముల

డీసెంట్ కథలతో సినిమాలు తీస్తూ కేవలం క్యారెక్టర్స్ మధ్య సంఘర్షణ, ఎమోషనల్ జర్నీని తెరపై ఆవిష్కరించి హిట్స్ కొట్టే దర్శకుల పేర్లు చెప్పుకుంటే వెంటనే శేఖర్ కమ్ముల పేరు వినిపిస్తుంది.ఆయన సినిమాలు అన్ని కూడా ఒకే పెట్రన్ లో ఉంటాయి.

 Sekhar Kammula Write Script For Varun Tej, Tollywood, Love Story Movie, Sai Pall-TeluguStop.com

శేఖర్ కమ్ముల సినిమాలో కథ ఏంటి అంటే ఎవరూ చెప్పలేరు కాని సినిమా ఎలా ఉంది అంటే మాత్రం సూపర్ అని చెబుతారు.అలాగే ఆయన సినిమాలు చూసిన వచ్చిన ప్రేక్షకులు అందులో క్యారెక్టర్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.

అలాంటి గొప్ప ఇంపాక్ట్ ని తన సినిమాల ద్వారా శేఖర్ కమ్ముల క్రియేట్ చేస్తూ ఉంటారు.ప్రస్తుతం సాయి పల్లవి, నాగ చైతన్య జోడీగా లవ్ స్టొరీ సినిమాని శేఖర్ కమ్ముల తెరకెక్కించారు.

ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి కూడా రెడీ అయిపొయింది.అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ వాయిదా వేసేశారు.

ఇప్పటికే ఈ సినిమాలో సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి.ప్రత్యేకంగా సారంగాదరియా సాంగ్ అయితే ట్రెండ్ సెట్ చేస్తుంది.సాయి పల్లవి, శేఖర్ కమ్ముల కాంబోలో ఫిదా తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.ఇందులో ఎమోషనల్ లవ్ స్టొరీని తెరపై కమ్ముల ఆవిష్కరించారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాని మెగా హీరో వరుణ్ తేజ్ తో శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే స్టొరీ లైన్ కూడా చెప్పి ఒకే చేయించుకున్నారని బోగట్ట.

లవ్ స్టొరీ వాయిదా పడటంతో ఇప్పుడు కమ్ముల ఆ సినిమా కంప్లీట్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ సినిమా కోసం కూడా శేఖర్ కమ్ముల సాయి పల్లవినే హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube