ఆయన బలవంతం చేశాడంటోన్న సాయి పల్లవి

ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న బ్యూటీ సాయి పల్లవి, ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసబెట్టి సినిమాలు చేస్తోంది.ఫిదా సినిమాతో అమ్మడు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

 Sekhar Kammula, Sai Pallavi, Fidaa, Telugu Movie News-TeluguStop.com

ఈ సినిమా క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరినీ అలరించడంతో సాయి పల్లవి వెనక్కి తిరిగి చూడలేదు.

కాగా తనను ఓ దర్శకుడు ఒక విషయంలో బలవంతం చేశాడంటూ తన పాత జ్ఞాపకాలను ఇటీవల గుర్తుకు చేసుకుంది ఈ బ్యూటీ.

తన తొలి తెలుగు చిత్రం ఫిదా సినిమా షూటింగ్ సమయంలో తనను స్లీవ్‌లెస్ డ్రెస్ వేసుకునేందుకు దర్శకుడు శేఖర్ కమ్ముల తనను బలవంత పెట్టాడని ఆమె చెప్పుకొచ్చింది.అందాల ఆరబోతకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండే సాయి పల్లవి స్లీవ్‌లెస్ స్కర్ట్ వేసుకునేందుకు తొలుత ఇష్టపడలేదట.

కానీ సినిమాలో ఒక సీన్ చాలా ముఖ్యమైనదని, ఆమె ఖచ్చితంగా వేసుకోవాల్సిందేనంటూ శేఖర్ కమ్ముల ఆమెను ఫోర్స్ చేశాడట.

అలాంటి డ్రెస్సులు వేసుకున్నప్పుడు సెట్స్‌లో అందరూ ఎలా చూస్తారో తనకు తెలుసని, అందుకే ఇకపై అలాంటి డ్రెస్సులు వేసుకోనని ఫిదా సినిమా సమయంలోనే నిర్ణయం తీసుకుందట ఈ బ్యూటీ.

కాగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్‌స్టోరి చిత్రంలో నటిస్తుండగా రానా దగ్గుబాటి సరసన విరాటపర్వం చిత్రంలో కూడా నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube