సారంగ దరియా కాంట్రవర్సీ.. క్రెడిట్ అంతా ఆమెకేనట!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా లవ్ స్టోరీ.ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి నటీనటులు గా నటించారు.

 Sekhar Kammula Respond Saranga Dariya Song Issue , Sekhar Kammula, Saranga Dari-TeluguStop.com

ఇక ఈ సినిమా టీజర్ విడుదల కాగా బాగా ఆకట్టుకుంది.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ లో తెరకెక్కనుంది.

ఈ సినిమాకు సంగీతాన్ని పవన్ సిహెచ్ అందించారు.

ఇక ఈ సినిమాలోని కొన్ని పాటలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో పక్క తెలంగాణ మాస్ తో వచ్చిన పాట ‘సారంగదరియా‘.ఈ పాట విడుదలైన క్షణంలోనే ఎన్నో లైక్ లను సొంతం చేసుకుంది.అంతేకాకుండా యూట్యూబ్ లో తెగ హల్ చల్ చేస్తుంది.ఇక ఈ పాట విడుదల అయిన తరువాత ఈ పాట గురించి పలు వార్తలు కూడా వినిపించాయి.

తాజాగా ఈ పాట పై కొన్ని వివాదాలు ఎదురుగా కాగా ఈ పాటను నేనే వెలుగులోకి తీసుకు వచ్చానంటూ గాయని కోమలి తెలిపింది.ఇటీవలే మీడియాతో మాట్లాడగా లవ్ స్టోరీ సినిమా లో నేను వెలుగులోకి తీసుకు వచ్చిన పాటని నాతో పాడిస్తామని చెప్పి.

పాటించలేరని తెలిపింది.ఇక ఈ విషయం గురించి స్పందించిన దర్శకుడు ఓ విషయాన్ని తెలిపాడు.

చాలా ఏళ్ళ కిందట రేలా రే రేలా ప్రోగ్రాంలో ఈ పాటను శిరీష అమ్మాయి పాడిందని ఇప్పటికీ ఆ పాట నా మనసులోని తిరుగుతూనే ఉందని తెలిపాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల.

Telugu Controversy, Komali, Love Story, Naga Chaitanya, Sai Pallavi, Saranga Dar

ఇక ఈ పాటను లవ్ స్టోరీ సినిమా కు తగ్గట్టుగా రాయమని సుద్దాల అశోక్ తేజ గారిని కోరారట.ఇక ఆయన ఆ పాట పల్లవి తీసుకొని కొన్ని మార్పులు చేసి చరణాలు రాశారట.ఈ పాటను శిరీష తో పాడిద్దామని అనుకోగా.

ఈ పాట తొలుత కోమలి నుండి వచ్చింది కాబట్టి తనతో పాడిద్దామని సుద్దాల గారు అన్నారని తెలిపారు.దీంతో ఆమెను వరంగల్ నుండి రమ్మని కోరగా ఆమె జలుబు, దగ్గు ఉండటం వల్ల రాలేనని తెలిపారని చెప్పుకొచ్చారు దర్శకుడు.

ఇక ఆ సమయంలో చెన్నై నుంచి వచ్చిన సంగీత దర్శకుడు రికార్డింగ్ కోసం వచ్చి ఉండటంతో సింగర్ మంగ్లీ తో పాడించామని తెలిపాడు.కానీ ఆ పాట క్రెడిట్ తో పాటు డబ్బులు కూడా ఇస్తామని కోమలికి చెబితే ఆమె ఒప్పుకుందట.

కానీ పాట విడుదల తర్వాత ఆమె చేసిన చర్చలు డైరెక్టర్ ఇంతవరకు చూడలేదని తెలిపాడు.ఇక డైరెక్టర్ ఈ క్రెడిట్ తప్పకుండా ఆమెకు ఇవ్వడంతో డబ్బులు కూడా ఇస్తామని తెలిపాడు.

అంతేకాకుండా ఆడియో వేడుకలో కూడా తనతో పాట పాడిస్తానని తెలిపాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube