శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్.. అఫీషియల్ అనౌన్స్ !

ఆనంద్, హ్యాపీ డేస్, ఫిదా సినిమాలతో టాలీవుడ్ లో కొత్త ప్రేమ కథలను తెరకెక్కించిన శేఖర్ కమ్ములకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.తన సినిమాలంటే ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర కూర్చుని చూడగలిగేలా ఉంటాయి.

 Sekhar Kammula Next Is A Biggie With Dhanush-TeluguStop.com

ఈయన ప్రేమ కథలను తెరకెక్కించడంలో మంచి పట్టు ఉంది.మనసుకు హత్తుకునేలా తీయగలిగే సత్తా ఉంది.

శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ పాత్రలకే అన్నట్టు ఉండదు.

 Sekhar Kammula Next Is A Biggie With Dhanush-శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్.. అఫీషియల్ అనౌన్స్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హీరోయిన్ కు కూడా నటన పై మంచి స్కోప్ ఉంటుంది.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ‘ అనే ప్రేమ కథను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాకు దాదాపు 35 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లు సమాచారం.

ఈ చిత్రం పై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది.

Telugu Dhanush, Kollywood, Love Story, Naga Chaitanya, Sai Pallavi, Sekhar Kammula, Sekhar Kammula Next Is A Biggie With Dhanush, Tollywood-Movie

ఈ సినిమాను ఏప్రిల్ 16 న విడుదల చేయడానికి సన్నాహాలు చేయగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.ఇప్పుడిప్పుడే అన్ని సర్దుకుంటున్న సమయంలో మళ్ళీ కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల చేయబోయే సినిమా గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించాయి.

శేఖర్ కమ్ముల కోలీవుడ్ హీరో ధనుష్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారని వార్తలు బాగా వైరల్ అయ్యాయి.తాజాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక పాన్ ఇండియా సినిమా రాబోతుందని ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.ఈ ప్రకటనతో ఈ క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకులు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు.

మరి చూడాలి శేఖర్ కమ్ముల ధనుష్ ను ఎలా ప్రెసెంట్ చేస్తాడో.

#SekharKammula #Sai Pallavi #Love Story #Sekhar Kammula #Dhanush

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు