పండగపూట లవ్‌స్టోరీ చూపిస్తానంటున్న డైరెక్టర్  

Sekhar Kammula Love Story Movie First Look On Sankranti-love Story,naga Chaitanya,sai Pallavi,sankranti,sekhar Kammula

టాలీవుడ్‌లో ఫీల్ గుడ్ సినిమాలకు కేరాఫ్ ఎవరంటే ఖచ్చితంగా శేఖర్ కమ్ముల పేరు ఆ జాబితాలో ఉండాల్సిందే.కేవలం ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించి వాటినే బ్లాక్‌బస్టర్స్‌గా మలిచిన దర్శకుడు శేఖర్ కమ్ములు.

Sekhar Kammula Love Story Movie First Look On Sankranti-Love Naga Chaitanya Sai Pallavi Sankranti

అందరూ కొత్తవాళ్లతో హ్యాపీడేస్ అనే సినిమాను తెరకెక్కించి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిపాడు ఈ దర్శకుడు.ఆ తరువాత కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాపులతో సాగిన శేఖర్ కమ్ముల కెరీర్, కొంతకాలం చాలా దారుణంగా మారింది.

అయితే ఫిదా సినిమాతో మరోసారి తన ట్యాలెంట్ ఏమిటో చూపించి బాక్సాఫీస్‌కు బొమ్మ చూపించాడు.

ఇప్పుడు మళ్లీ ఫిదా పోరి సాయి పల్లవిని హీరోయిన్‌గా పెట్టి అక్కినేని నాగచైతన్యను హీరోగా పెట్టి ఓ సినిమాను ప్రారంభించి షూటింగ్‌ను కూడా ముగింపుదశకు తీసుకొచ్చాడు.

ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ మాత్రం రాలేదు.

కాగా ఈ సినిమాకు సంబంధించి చాలా రోజులుగా ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో, సంక్రాంతి పండగ నాడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి పండగ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నాడట శేఖర్ కమ్ముల.

అయితే సంక్రాంతి పండగ సీజన్‌లో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంటుందా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

ఫిలింనగర్ వర్గాల్లో ఈ వార్త ప్రస్తుతం జోరుగా వినిపిస్తుంది.నాగచైతన్య, సాయి పల్లవిల కాంబినేషన్ వెండితెరపై సరికొత్త అనుభూతిని తీసుకురావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోండగా ఈ సినిమాతో శేఖర్ కమ్ముల మరోసారి బాక్సాఫీస్‌కు చుక్కలు చూపించడం మాత్రం ఖాయమని తెలుస్తోంది.ఏదేమైనా సంక్రాంతి పండగను మరింత సందడిగా మార్చేందుకు ఈ చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

Sekhar Kammula Love Story Movie First Look On Sankranti-love Story,naga Chaitanya,sai Pallavi,sankranti,sekhar Kammula Related....