చైతూని మరో గిఫ్టు రెడీ చేసుకోమంటున్న డైరెక్టర్  

Sekhar Kammula Gifted By Naga Chaitanya - Telugu Love Story Movie, Naga Chaitanya, Sai Pallavi, Sekhar Kammula, Telugu Movie News

అక్కినేని నాగ చైతన్య ఇటీవల వెంకీ మామ చిత్రంలో నటించి తన మేనమామ వెంకీతో కలిసి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు.కాగా ప్రస్తుతం ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు చైతూ.

Sekhar Kammula Gifted By Naga Chaitanya - Telugu Love Story Movie, Naga Chaitanya, Sai Pallavi, Sekhar Kammula, Telugu Movie News-Movie-Telugu Tollywood Photo Image

ఫిదా పోరి సాయి పల్లవి హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘లవ్ స్టారీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ‘ఏయ్ పిల్ల’ అనే పాటకు సంబంధించిన ప్రివ్యూ వీడియోను ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 14న రిలీజ్ చేశారు.

ఈ ప్రివ్యూ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషంగా ఉన్నారు.ఈ సందర్భంగా చైతూ డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ఓ స్పెషల్ గిఫ్ట్ అందించాడు.

కాగా ఈ గిఫ్ట్ అందుకున్న శేఖర్ కమ్ముల తన సంతోషాన్ని ట్వీట్ రూంలో తెలిపాడు.

ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.ఈ గిఫ్ట్ తనను బాగా టచ్ చేసిందని, నెక్ట్స్ గిఫ్ట్‌కు రెడీ కావాలంటూ చైతూకు ట్వీట్ చేశాడు శేఖర్ కమ్ముల.ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

తాజా వార్తలు