వాట్సాప్ వాడని ఒకే ఒక్క టాలీవుడ్ డైరెక్టర్ ఇతనే..?

ప్రస్తుత కాలంలో మెసేజ్ లు పంపడానికి మన దేశంతో పాటు ఇతర దేశాల ప్రజలు కూడా వాట్సాప్ యాప్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ యాప్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

 Sekhar Kammula Does Not Use Whats App At Al-TeluguStop.com

అయితే ఒక టాలీవుడ్ డైరెక్టర్ మాత్రం వాట్సాప్ యాప్ ను అస్సలు వినియోగించరు.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల వాట్సాప్ యాప్ ను అస్సలు వినియోగించరు.

ఒక ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న నంబర్ 1 యారి షోలో పాల్గొన్న శేఖర్ కమ్ముల ఈ విషయాన్ని తెలిపారు.

 Sekhar Kammula Does Not Use Whats App At Al-వాట్సాప్ వాడని ఒకే ఒక్క టాలీవుడ్ డైరెక్టర్ ఇతనే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శేఖర్ కమ్ములతో పాటు నాగచైతన్య, సాయిపల్లవి కూడా ఈ షోకు హాజరయ్యారు.రానా శేఖర్ కమ్ములను మీరు లవ్ ఎమోజీని ఎప్పుడు వాడారని అడగగా నాగచైతన్య శేఖర్ కమ్ముల వాట్సాప్ వాడరని తెలిపారు.

చాలామంది ఆయనకు వాట్సాప్ లో మెసేజ్ పంపి ఆయన మెసేజ్ కు రిప్లై ఇవ్వరని భావించి అపార్థం చేసుకున్నారని నాగచైతన్య పేర్కొన్నారు.ఆ తరువాత వాట్సాప్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటానని శేఖర్ కమ్ముల చెప్పగా చైతన్య మాత్రం మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అదే విధంగా ఉండాలని చెప్పారు.శేఖర్ కమ్ముల ఇతరులతో కాంటాక్ట్ అవ్వాలన్నా ఫోన్ చేయడం లేదా మెసేజ్ చేయడం చేస్తారని సమాచారం.

మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న లవ్ స్టోరీ సినిమా ఈ నెల 16వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.

ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది.

#Love Story #Does Not Use #Whats App #Sekhar Kammula

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు