తమిళ ఆడియెన్స్ కోసం మార్పులు కోరుతున్న ధనుష్!

తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగి ఆడియెన్స్ ను రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్నాడు ధనుష్.ఈయన సినిమాలంటే తమిళ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది.వరుసగా హిట్స్ కొడుతూ దూసుకు పోతున్నాడు.ధనుష్ సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి.కానీ ఈసారి ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమాలో కూడా నటించడానికి రెడీ అయ్యాడు.

 Sekhar Kammula Dhanush Movie Latest Update Details, Sekhar Kammula,  Dhanush, La-TeluguStop.com

టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.తెలుగు, తమిళం ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కించ నున్నారు.డైరెక్ట్ తెలుగు సినిమా అయితే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యేందుకు అవకాశాలు ఉన్నందున ధనుష్ ఈ సినిమాను ఒప్పుకున్నాడు.

ధనుష్ శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్న నేపథ్యంలో తాజాగా ఒక క్లాష్ వచినట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రెసెంట్ స్క్రిప్ట్ విషయంలో చర్చలు జరుగుతుండగా ధనుష్ కథలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా శేఖర్ కమ్ములను కోరాడట.

Telugu Dhanush, Dhanushscript, Dhanushsekhar, Dhanushdirect, Latest, Sekhar Kamm

ఈ సినిమాలో శేఖర్ కమ్ముల ధనుష్ ను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట.కానీ ధనుష్ సినిమాల్లో ప్రక్కాగా తమిళ్ స్టైల్ లో ఆయన కట్టు, బొట్టు ఉంటుంది.

కానీ ఇప్పుడు తెలుగు డైరెక్టర్ చేస్తున్నాడు కాబట్టి తమిళ్ ఫ్లేవర్ ఉండదనే చెప్పాలి.

మరి ఆ విషయంలో తమిళ ఆడియెన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఇక్కడ ప్రశ్న.అందుకే ధనుష్ తమిళ్ ఆడియెన్స్ కోసం కొన్ని మార్పులు చేయాలనీ కోరుతున్నాడట.

కొద్దిగా తమిళ్ టచ్ ఇచేలా స్క్రిప్ట్ చేంజ్ చేయాలనీ కోరుతుండగా అందుకు శేఖర్ కమ్ముల ఏం చెప్పలేకపోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

Telugu Dhanush, Dhanushscript, Dhanushsekhar, Dhanushdirect, Latest, Sekhar Kamm

శేఖర్ కమ్ముల తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథ రాసుకున్నాడట.కానీ ఇప్పుడు ధనుష్ తమిళ్ ఆడియెన్స్ కోసం కొన్ని మార్పులు చేయాలని కోరుతున్నాడు.అయితే వీరిద్దరి మధ్య వచ్చిన క్లాష్ అతి త్వరలోనే సర్దుకుంటుందని.

మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాను పట్టాలెక్కించ బోతున్నారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube