తెలుగు సినీ ప్రేక్షకులకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల( Director Sekhar Kammula ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.శేఖర్ కమ్ముల సినిమాలు అంటే చాలు ప్రతి ఒక్కరికి ఒక ఫీల్ గుడ్ ఎమోషన్ కలుగుతూ ఉంటుంది.
ఆయన సినిమాలో ఎక్కువగా ఫ్యామిలీలు చూసే విధంగా అలాగే ఆహ్లాదకరంగా మనసుకు తాకేలా ఉంటాయి.అంతేకాకుండా ఆయన సినిమాలు ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టవు.24 ఏళ్ళ కెరిర్ లో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ అవన్నీ కూడా మంచి ఫలితాలను సాధించాయి.2000లో కెరీర్ మొదలు పెట్టిన శేఖర్ కమ్ముల ఇక 25 ఏటలోకి అడుగు పెడుతున్నాడు.
ఈ సందర్భంగా ఆయన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.హ్యాపీడేస్ సినిమా( Happy Days Movie ) ఎంతో ప్రత్యేకమని అన్నాడు.ఇన్నేళ్ళు అయినా మళ్ళీ మళ్ళీ కాలేజీకి రావాలనిపిస్తుంది.అలానే మళ్లీ మళ్ళీ ఆ సినిమా చూడాలి అనిపించేలా ఉంటుందని అన్నారు.అందులో సంగీతం కూడా అంత బాగుంటుందని అన్నాడు.ఏదైనా ఔట్ డేట్ అవుతుందేమోనని నేను మొన్ననే మరలా చూశానని, చాలా ఫ్రెష్‌గా ఉందని, రీరిలీజ్ కూడా యూత్ కు ఒక పండుగలా వుంటుందని అన్నాడు.
హ్యాపీడేస్ సీక్వెల్ అనుకున్నాను కానీ, కథ సెట్ అవ్వడం లేదు.ఇన్నేళ్ల కెరీర్‌లో సినిమా చేసి సక్సెస్ అవ్వాలనుకోవడం, నిలబడడం చూస్తే నా పట్ల నాకు చాలా గర్వంగా ఉంది.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నా విలువలకు తగినట్లు సినిమా తీయడం గొప్పగా అనిపిస్తుంది.నేను ఏ సినిమా చేసినా విలువలు, సిద్దాంతాలు, చెడు చెప్పకూడదు అనే ఫార్మెట్‌లోనే వెళ్తాను.
నేను పేరు, డబ్బు కోసం సినిమా రంగానికి రాలేదు.అలా అని సినిమాలు తీయలేదు.
అదే నాకు గర్వంగా అనిపిస్తుంది.నాకు నా కెరియర్ ఎప్పుడూ స్లో అనిపించలేదు.
నేను సినిమా చేసే పద్దతి నా సినిమాలే నా గురించి మాట్లాడతాయి.కాపీ కొట్టి కథలు( Copy Movies ) తాను చేయను.
కంటెంట్ పరంగా బాగా చెప్పాలనుకుంటాను అని తెలిపారు శేఖర్ కమ్ముల.