సీజ్ చేసిన వాహనదారులకు గుడ్ న్యూస్....డబ్బులు కట్టకుండానే....

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఇలా కట్టడం నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై సంచరించినందుకుగానూ ప్రభుత్వ అధికారులు ద్విచక్ర వాహనాలు, కార్లు తదితర వాహనాలను సీజ్ చేశారు.

 Police Seized Vehicles, Police Challan   Andhra Pradesh, Ap Rto-TeluguStop.com

ఈ క్రమంలో కొంత మందికి అపరాధ రుసుం విధించగా మరి కొంతమంది వాహనాలను మాత్రం సీజన్ సంబంధిత పోలీస్ స్టేషన్లలో అప్పగించారు.

అయితే గత కొద్ది కాలంగా సీజ్ చేసినటువంటి వాహనాలు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఉండిపోయాయి.

దీంతో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారులు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా సీజ్ చేసిన వాహనాలను వాహన యజమానులు సరైన పత్రాలను చూపించి తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.అయితే ఇందుకుగాను వాహన యజమానులు చేయాల్సిందల్లా మరోమారు ఇలాంటి తప్పిదం చేయమని హామీ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

అలాగే ఎటువంటి అపరాధ రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు.దీంతో సీజ్ చేసిన వాహన యజమానులు తమ వాహనాలను తీసుకెళ్లేందుకు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం లాక్ డౌన్ లో సడలింపులు చేపట్టడంతో రోజు రోజుకి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని కాబట్టి మరి కొంత కాలం పాటు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube