కుళ్ళిన స్థితిలో కనిపించిన స్టార్ నటుడు మృతదేహం  

Seinfeld Actor Charles Levin Found Dead In Oregon-

మరణం మనిషికి ఎప్పుడు ఎలా ఎక్కడ వస్తుందో ఎవరు ఊహించలేరు.అది వచ్చినపుడు స్వీకరించడమే తప్ప ఎదురించే శక్తి ఈ అనంతంలో మానవమాత్రుడుకి లేదు.అతిలోక సుందరి అనుకున్న శ్రీదేవి అతి సాధారణంగా ఓ మూడు అడుగుల నీటి తొట్టెలో ఊపిరాడక చనిపోతుందని, అది కూడా దుబాయ్ లో చనిపోతుందని ఎవరు ఊహించి ఉండరు.అలాగే ఇక ఇండియా ఎప్పటికి గుర్తుపెట్టుకునే సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు ఎక్కడ, ఎలా చనిపోయాడు ఇప్పటికి అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది.

Seinfeld Actor Charles Levin Found Dead In Oregon- Telugu Tollywood Movie Cinema Film Latest News Seinfeld Actor Charles Levin Found Dead In Oregon--Seinfeld Actor Charles Levin Found Dead In Oregon-

ఇక ఫార్ములా వన్ రేస్ లో ప్రపంచాన్ని శాశించిన మైఖేల్ షుమాకర్ అదే కారు ప్రమాదంలో మంచం పట్టి చనిపోయారు.ఎలా చెప్పుకుంటూ పొతే చాలా ఉంటాయి.ఇప్పుడు హాలీవుడ్ లో 90వ దశకంలో స్టార్ నటుడుగా వెలిగిన చార్లెస్ లెవిన్ కుళ్ళిన మృతదేహం స్థితిలో కనిపించాడు.

హాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన నటుడు చార్లెస్ అమెరికన్ ప్రముఖ నటుల్లో ఒక్కడిగా స్థానం దక్కించుకున్నాడు.

వయసు ప్రభావంతో నటనకు దూరంగా ఉంటున్న చార్లెస్ కొన్ని రోజుల క్రితం కారులో ఒంటరిగా బయలుజేరి కనిపించకుండా పోయాడు.ఇక అప్పటి నుంచి పోలీసులు అతని ఆచూకి కోసం వెతుకుతూనే ఉన్నారు.అయితే పోలీసులకి చార్లెస్ కారు కాని, అతని ఆనవాళ్ళు కాని ఎక్కడ దొరకలేదు.చివరికి వారం రోజుల క్రితం మనుషులు కూడా వెళ్లలేని ఓ ప్రాంతంలో చార్లెస్ మృతదేహం అవశేషాలు కనిపించాయి.

దాన్ని చార్లెస్ శరీరంగా పక్కనే ఉన్న అతడి కుక్క కారణంగా గుర్తించారు ఆ ప్రాంతంకు చార్లెస్ ఎందుకు వెళ్లాడు.ఎలాంటి పరిస్థితుల్లో ఆయన అక్కడకు వెళ్లి ఉంటాడనే విషయాలపై పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.అయితే అతని మరణం గురించి తెలిసిన హాలీవుడ్ ప్రముఖులు అతనికి నివాళి అర్పించడం విశేషం.