కరోనా వైరస్ కారణంగా గత సంవత్సరం జరగాల్సిన లెజెండ్స్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 4 మ్యాచ్ లు అనంతరం వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే.ఈ సిరీస్ తాజాగా రాయ్పూర్ లోని షాహీద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మళ్లీ ప్రారంభం అయింది.
ఈ మ్యాచ్ లో భాగంగా బంగ్లాదేశ్ లెజెండ్స్, ఇండియా లెజెండ్స్ మధ్య అత్యంత ఉత్సాహంతో ఇండియన్ టీం 10 వికెట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది.
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ వరల్డ్ సిరీస్ లో విధ్వంసం సృష్టించాడు.
వీరేంద్ర సెహ్వాగ్ కేవలం 35 ఇంతలోనే 80 పరుగులు తీసి ఇండియన్ లెజెండ్స్ జట్టును విజయం వైపు నడిపించాడు.వరల్డ్ సిరీస్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ లెజెండ్స్ 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు.బంగ్లాదేశ్ టీమ్ లో నజీముద్దీన్ (49) బ్యాట్స్మెన్ ఒక విధంగా ఆడినా మిగతా ఎవరు బ్యాట్స్మెన్స్ పెద్దగా పరుగులు సొంతం చేసుకోలేకపోయారు.
ఇక 110 పరుగుల విజయ లక్ష్యంతో తరువాత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఓపెనర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించారు.కెప్టెన్ సచిన్ టెండూల్కర్ కాస్త నిదానంగా ఆడిన కానీ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం తొలి బంతి నుంచి బౌండరీలు, సిక్సర్లతో తానేంటో నిరూపించుకున్నాడు.
మరోవైపు సచిన్ టెండూల్కర్ కూడా 33 పరుగులతో తన వంతు సహకారం అందించి విజయం వైపు పరుగులు పెట్టించారు.కేవలం 10.1 ఓవర్లలోనే ఇండియన్ లెజెండ్స్ టీం వికెట్ కూడా కోల్పోకుండా 114 పరుగులు సొంతం చేసుకొని విజయం బాట పట్టింది.ఏది ఏమైనా గాని ఈ సిరీస్ లో ఇండియన్ లెజెండ్స్ లో వీరు ఏంటో మరో సరి నిరూపించుకున్నారు అనే చెప్పాలి.

ప్రపంచ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి ఎన్నో సంవత్సరాలు అయినా సరే తనదైన మార్క్ బ్యాటింగ్ మాత్రం మర్చిపోలేదు వీరేంద్ర సెహ్వాగ్.అవతలి జట్టు బౌలర్ ఎవరైనా సరే బాలు వేస్తే కొడితే మాత్రం బాల్ బౌండరీ లైన్ అవతల ఉండేలా మాత్రమే ఆలోచించే వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలితో బ్యాటింగ్ చేస్తూ రెచ్చిపోయాడు.