ఇంగ్లాడ్ టీమ్ పై సెహ్వాగ్ సెటైర్.. వైరల్ వీడియో

భారత క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది.భారత్ సాధించిన ఎన్నో అపూర్వమైన విజయాలలో సెహ్వాగ్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

 Sehwag Satire On England Team Viral Video, Sehwag, Indian Cricketer Sehwag-TeluguStop.com

అయితే గ్రౌండ్ లో సిక్సర్లతో అలరించిన సెహ్వాగ్ తరువాత ట్విట్టర్ లో ట్వీట్ లతో సిక్సర్ లు కొడుతున్నాడు.క్రికెట్ లో జరిగే విశేషాలను ఫన్నీగా సెటైరికల్ గా వీడియోలతో కొన్ని సార్లు, కొటేషన్స్ తో ఒకసారి తనదైన శైలిలో ట్వీట్ చేస్తూంటారు.

సెహ్వాగ్ ట్వీట్లను సెహ్వాగ్ ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేసాడో వారు కూడా ట్వీట్ ను ఎంజాయ్ చేస్తారు.అయితే ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ లో ఇంగ్లాండ్ ఓడిపోవడంపై ట్విట్టర్ లో సెహ్వాగ్ స్పందించాడు.

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో చేసిన బాయ్.బాయ్ అంటున్న వీడియోను ఇంగ్లాండ్ ను ఉద్దేశించి ఇక మీరు ఓటమితో ఇంటికి వెళ్లిపోండి అనే అర్థం వచ్చేలా సెహ్వాగ్ వీడియోను ట్వీట్ చేసాడు.

సెహ్వాగ్ ట్వీట్ ను సమర్థిస్తూ క్లాసిక్ వీరూ అంటూ హర్భజన్ సింగ్ ట్వీట్ చేసాడు.అయితే ప్రస్తుతం సెహ్వాగ్ విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

నెట్టింట్లో హల్ చేస్తున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube