పాండ్యా ను మించిన వారు లేరు అంటూ ప్రశంసలు కురిపిస్తున్న మాజీ ఓపెనర్

త్వరలో ఇంగ్లాండ్ లో జరగబోయే వరల్డ్ కప్ లో టీమిండియా టీమ్ లో స్థానం దక్కించుకున్న హార్దిక్ పాండ్యా పై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంశల వర్షం కురిపించాడు.విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ,మహేంద్ర సింగ్ ధోనీ ఇలా మంచి మంచి టాలెంటెడ్ క్రికెటర్స్ జట్టులో ఉన్నప్పటికీ సెహ్వాగ్ మాత్రం పాండ్యా నే ది బెస్ట్ అంటూ కామెంట్ చేశాడు.

 Sehwag Praises Pandya-TeluguStop.com

ఓపెనర్ సెహ్వాగ్ రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా పలు ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా హార్దిక్ పాండ్యా పై సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు.

ఈ మధ్య కాలంలో బీభత్సమైన ఫామ్ లో ఉన్న పాండ్యా… బంతితో బ్యాటుతో అదరగొడుతున్నాడని… అతనికి దరిదాపుల్లో ఎవ్వరూ రాలేకపోతున్నారంటూ కామెంట్ చేశాడు.కొంతకాలంగా భారత జట్టులో కీలకంగా మారిన ఆల్రౌండర్ హర్దిక్ పాండ్యా ఐపీఎల్ 12 సీజన్లో అద్భుతంగా రాణించి ముంబై ఇండియన్స్ నాలుగో సారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు అని చెప్పాలి.

15 ఇన్నింగ్స్ ల్లో 402 పరుగులు చేసిన హర్దిక్ పాండ్యా స్టైక్ రేటు 91.42.అతడు ఒక్క బ్యాట్ తొంనే కాకుండా బౌలింగ్ తోనూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు.ఐపీఎల్ సీజన్ 12 లో 15 ఇన్నింగ్స్ లో 14 వికెట్లు తీసి ముంబై జట్టులో కీ ప్లేయర్ గా మారాడు.ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన హర్దిక్ పాండ్యా 34 బంతుల్లో 91 పరుగులు చేసి విధ్వంసకర బ్యాటింగ్ రుచి చూపించాడు.9 సిక్సులు, 6 ఫోర్లతో బౌలర్లపై విరుచుపడిన హర్దిక్ పాండ్యా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ముంబై ఇండియన్స్ ఆ మ్యాచ్లో భారీ లక్ష్య చేధనలో పోరాడి ఓడింది.అయితే ఈ మ్యాచ్ లో విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ పాండ్యా అద్భుతమైన బ్యాటింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు.ఇటీవల కరణ్ జోహార్ కార్యక్రమం అయినా ‘కాఫీ విత్ కరణ్’షోలో పాండ్యా మహిళల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.

అయితే ఆ తరువాత వెంటనే టీమ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా రాణిస్తున్నాడు.అయితే ఈ వరల్డ్ కప్ లో పాండ్యా కీలక ఆటగాడిగా మారతాడని వీరూ అభిప్రాయపడుతున్నాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube