టీఆర్ఎస్ అధిష్టానానికి తగిలిన ప్రతిపక్షాల సెగ...ఆచితూచి స్పందన అందుకేనా?

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం మొదటి దఫా సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయంలో తెలంగాణ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ అనేది లేదు.

 Sega Of The Opportunity To The Sursess Of Trs Trs ... Will There Be An Immediate-TeluguStop.com

తరువాత రెండో దఫా సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా రిపీట్ అయింది.అయితే ప్రస్తుతం మాత్రం అప్పటి పరిస్థితుల కంటే పూర్తి భిన్నంగా ఉన్న పరిస్థితి ఉంది.

అయితే ప్రస్తుతం బీజేపీకి కాంగ్రెస్ మధ్య రెండో ప్రత్యామ్నాయ పార్టీ స్థానం కోసం పోటీ జరుగుతోంది.ప్రభుత్వం పరంగా ఉన్న లోటుపాట్లను బలంగా ఎట్టి చూపిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే తాజాగా ఇటు కాంగ్రెస్ పార్టీ రకరకాల పేర్లతో నిరసన ప్రదర్శనలు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది.అదే విధంగా బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ అధ్యక్షతన పాదయాత్రను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇంతలా ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల సమస్యలపై పోరాడుతుండటంతో ఈ నిరసనల సెగ ప్రభుత్వాన్ని తాకినట్లు తెలుస్తోంది.అంతేకాక త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఉన్న తరుణంలో ప్రతిపక్షాలు తమ విమర్శల జోరును మరింత పెంచిన పరిస్థితి ఉంది.

అందుకే ప్రతిపక్షాల విమర్శలపై ఆచితూచి స్పందిస్తున్న పరిస్థితి ఉంది.అంతేకాక ప్రస్తుతం చాలా వరకు సమస్యలను ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Bandisanjay, Bjp, Congress, Etala Rajendher, Telangana, Trs, Ts-Latest Ne

అయితే ఏదైనా వాస్తవం లేని విమర్శల పట్ల మాత్రమే ప్రభుత్వం ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఉంది.ప్రతిపక్షాల పట్ల ఆచితూచి స్పందిస్తే రాను రాను చాలా రకాల సమస్యలకు సమాధానం ఇవ్వవలిసి ఉంటుంది.తద్వారా ప్రతి పక్షాలకు మరింత ఊతమిచ్చినట్టు ఉంటుందనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ ఆచితూచి స్పందిస్తున్న పరిస్థితి ఉంది. 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube