సీటీమార్ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: సీటీమార్
నటీనటులు: గోపీచంద్, తమన్నా, రావు రమేష్ తదితరులు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
దర్శకత్వం: సంపత్ నంది
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 10, 2021

 Seetimaarr Review And Rating, Seetimaarr, Gopichand, Tamannaah, Sampath Nandi, S-TeluguStop.com

మ్యాచో స్టార్ గోపీచంద్ సినిమా వస్తుందంటే అందులో ఖచ్చితంగా యాక్షన్ అంశాలు పుష్కలంగా ఉంటాయని భావిస్తుంటారు ఆడియెన్స్.అయితే గతకొంత కాలంగా కేవలం యాక్షన్ అంశాలనే నమ్ముకున్న గోపీచంద్ కథల ఎంపికలో పర్ఫెక్షన్ చూపించకపోవడంతో ఆయన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.

కానీ ఈసారి యాక్షన్‌తో పాటు కంటెంట్‌ను కూడా పూర్తిగా నమ్ముకుని ‘సీటీమార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుక వచ్చాడు.దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతమేర అందుకున్నాయో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

కార్తీక్ సుబ్రహ్మణ్యం(గోపీచంద్) ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా ఎంట్రీ ఇస్తాడు.అయితే అమ్మాయిలు కబడ్డీ ఆడేందుకు వారి కుటుంబాలు అంగీకరించకపోవడంతో వారిని ఒప్పించేందుకు కష్టపడతాడు కార్తీక్.అటు తెలంగాణ మహిళల కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి(తమన్నా)తో ప్రేమలో పడతాడు కార్తీక్.

కట్ చేస్తే.నేషనల్ కబడ్డీ పోటీలకు ఈ రెండు జట్లు పోటీ పడటం, ఈ క్రమంలో కార్తీక్, జ్వాలారెడ్డిలను ఓ గ్యాంగ్ బెదిరిస్తూ వస్తోంది.

అయితే ఓ పోలీస్ ఆఫీసర్ కూడా వీరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.ఇంతకీ ఈ పోలీస్ ఆఫీసర్ ఎందుకు వారిని అడ్డుకోవాలని చూస్తాడు? అసలు కార్తీక్ ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? నేషనల్ కబడ్డీ పోటీల్లో కార్తీక్ టీమ్ గెలుస్తారా లేదా? అనేది సినిమా కథ.

విశ్లేషణ:

చాలా రోజుల తరువాత గోపీచంద్ నుండి పూర్తిస్థాయి ఎంటర్‌టైనింగ్ మూవీ సీటీమార్ రూపంలో వచ్చిందని చెప్పాలి.వినాయక చవితి కానుకగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

కబడ్డీ కోచ్‌గా గోపీచంద్ తనదైన పర్ఫార్మెన్స్‌తో సినిమా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం బాగుంది.ఇక ఈ సినిమా కథనం విషయానికి వస్తే.ఫస్టాఫ్‌లో హీరో పాత్ర ఎంట్రీ నుండి మొదలుకొని, మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను అతడు ప్రశ్నించే తీరును బాగా చూపించారు.మహిళలు అన్నింట్లో ముందుండాలని అతడు ప్రయత్నించడం, ఈ క్రమంలో కబడ్డీ ఆటలో మహిళలకు తగిన గుర్తింపు తెచ్చేందుకు అతడు పడే పాట్లు మనకు బాగా చూపించాడు దర్శకుడు.

అటు జ్వాలా రెడ్డి పాత్రలో తమన్నాను తీసుకోవడం కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చిందని చెప్పాలి. గోపీచంద్, తమన్నాల మధ్య నడిచే ట్రాక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

అయితే ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే సీక్వెన్స్ ఈ సినిమా సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేలా ఉండటం ప్లస్ అయ్యిందని చెప్పాలి.

ఇక సెకండాఫ్‌లో కబడ్డీ ఆటలో మహిళా ప్లేయర్లకు గోపీచంద్ ఇచ్చే ట్రెయినింగ్, ఈ క్రమంలో వారిని నేషనల్ పోటీల్లో పాల్గొనకుండా చూసే గ్యాంగ్, వారిని గోపీచంద్ ఎదుర్కొనే సీన్స్‌తో సినిమాను చాలా ఇంట్రెస్టింగ్‌గా నడిపించారు.

ఇక మధ్యలో వచ్చే పాటలు కూడా ఈ సినిమాకు ఎలాంటి మైనస్ చేయకుండా ఉండటం మరో విశేషం.మణిశర్మ అందించిన బీజీఎం కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన మ్యూజిక్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.గోపీచంద్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను చాలా ఎమోషనల్‌గా చూపించాడు దర్శకుడు సంపత్ నంది.

ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే కబడ్డీ ఆట సీన్స్ ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని ఏమాత్రం తగ్గకుండా చేయడంలో సక్సెస్ అయ్యాయి.మొత్తానికి గోపీచంద్ ఓ పవర్‌ప్యాక్డ్ కంటెంట్ సినిమాతో మనముందుకు వచ్చి అదిరిపోయే హిట్ కొట్టాడని చెప్పాలి.

నటీనటులు పర్ఫార్మెన్స్:

కార్తీక్ సుబ్రహ్మణ్యంగా గోపీచంద్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బాగా అసెట్ అయ్యిందని చెప్పాలి.పవర్‌ఫుల్ కోచ్‌గా తన జట్టు సభ్యులను కాపాడేందుకు విలన్‌లతో ఫైట్ చేసే కోచ్‌గా గోపీచంద్ యాక్టింగ్ సూపర్.

ఇక ఎమోషన్ సీన్స్, మహిళల గురించి ఆయన చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి.అటు జ్వాలా రెడ్డి పాత్రలో తమన్నా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది.తెలంగాణ యాసలో అమ్మడు చేసే యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.రావు రమేష్ పాత్ర కూడా ఈ సినిమాలో చక్కగా కుదిరిందని చెప్పాలి.మిగతా నటీనటులు వారి పరిధి మేర నటించి మెప్పించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:

సీటీమార్ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు సంపత్ నంది, ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యాడు.కేవలం మాస్ అంశాలే కాకుండా స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న కథను ఎంచుకుని ఆడియెన్స్ టేస్ట్‌కు అనుగుణంగా మలిచి ఈ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాడు.ఆయన టేకింగ్, కథను నెరేట్ చేసిన తీరు బాగుంది.

ఇక ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ మణిశర్మ సంగీతం.ఈ సినిమాలోని పాటలు, ముఖ్యంగా జ్వాలారెడ్డి పాట ఈ సినిమాకే హైలైట్.

యాక్షన్ సీన్స్‌లో మణిశర్మ బీజీఎం సాలిడ్‌గా ఉండటంతో థియేటర్లలో రీసౌండ్ వినిపించింది.సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పనులు కూడా బాగున్నాయి.ఈ సినిమా కోసం నిర్మాత పెట్టిన ఖర్చు మనకు తెరపై కనిపిస్తుంది.

చివరగా:

సీటీమార్ – గోపీచంద్ గట్టిగానే విజిల్ వేయించాడు!

రేటింగ్:3.0/5.0

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube