ఇప్పటి వరకూ సీటిమార్ బ్రేక్ ఈవెన్ కి కూడా కలెక్ట్ చెయ్యలేదటగా..

తెలుగులో ఇటీవలే యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో నటించిన “సీటిమార్” చిత్రం ఈనెల 10వ తారీఖు న ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.కాగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తరహాలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది.

 Seetimaarr Movie Is Near To Break Even Collection-TeluguStop.com

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా మిల్క్ బ్యూటీ “తమన్నా భాటియా” నటించగా తెలుగు ప్రముఖ దర్శకుడు “సంపత్ నంది” దర్శకత్వం వహించాడు.అయితే ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ తో శుభారంభం చేసి కలెక్షన్లు బాగానే సాధించింది.

ఈ క్రమంలో రెండో వారం ఆరంభంలో కూడా అదే జోరు కొనసాగిస్తూ ఇప్పటి వరకు దాదాపుగా 12 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది.దీనికితోడు ఇటీవల విడుదలైన ఇతర టాలీవుడ్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఈ అంశం సీటిమార్ కి బాగానే కలిసొచ్చింది.

 Seetimaarr Movie Is Near To Break Even Collection-ఇప్పటి వరకూ సీటిమార్ బ్రేక్ ఈవెన్ కి కూడా కలెక్ట్ చెయ్యలేదటగా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ కరోనా వైరస్ కారణంగా గా ప్రజలు సినిమా థియేటర్లకు రావడానికి కొంతమేర జంకుతుండడంతో కలెక్షన్లకి గండి పడింది.అయితే ఇప్పటి వరకు సీటిమార్ చిత్రం దాదాపుగా 12 కోట్ల రూపాయలు సాధించడంతో మరో 2 కోట్ల రూపాయలు సాధిస్తే బ్రేక్ ఈవెన్ ని చేరుకుంటుంది.

దీంతో చిత్ర యూనిట్ సభ్యులు కూడా ప్రమోషన్స్ పై దృష్టి సారించారు.

Telugu Gopichand, Sampath Nandi, Seetimaarr, Seetimaarr Movie Break Even Collection, Seetimaarr Movie Is Near To Break Even Collection, Tamanna-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా సిటిమార్ చిత్రంతో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న యాక్షన్ హీరో గోపీచంద్ ఈ ఊపులోనే “ఆరడుగుల బుల్లెట్” చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.అయితే ఈ చిత్రంలో గోపీచంద్ కి జోడీగా ప్రముఖ హీరోయిన్ “నయనతార” నటించింది.కాగా ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తయి ఇప్పటికే దాదాపుగా కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ పలు కారణాల వల్ల ఈ చిత్రం విడుదల వాయిదా పడింది.

#Tamanna #Sampath Nandi #Gopichand #Seetimaarr

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు