ఒక చిన్న దర్శకుడు... అతి పెద్ద హిట్..మనసుకు హత్తుకునే సినిమా

నేటి రోజుల్లో తాత మనవడు లేదా మనవరాలు అనే అనుబంధాలు ముగిసిపోతున్నాయి.ఒకరి గురించి మరొకరు ఆలోచించడం లేదు.

 Seetharamayya Gari Manavaralu Movie Behind Story Details, Seetharamayya Gari Man-TeluguStop.com

అలాగే వారి అనుబంధాలను ఎవరు గుర్తించడం లేదు.తమ కుటుంబ సభ్యులతో హాయ్ గా కూర్చొని మాట్లాడం కూడా కుదరని రోజులు ఇవి, ఇక తాత అమ్మమ్మ బంధాలు అనే విషయం దాదాపు అసాధ్యం.

కానీ నాటి రోజులు అలా కాదు.అప్పటి వారు ఎంతో గొప్ప వారు అందుకే అలాంటి బందాలపై గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి.

అలాంటి గొప్ప సినిమాల్లో ఒకటి సీత రామయ్య గారి మనవరాలు.

ఈ సినిమాలో ప్రేమలు, బంధాలు చాలా చక్కగా చూపించారు.

అలాగే ఈ చిత్రానికి అనేక గొప్ప అవార్డ్స్ కూడా దక్కాయి.ఈ సినిమా కోసం తొలిసారి అక్కినేని నాగేశ్వర రావు గారు విగ్ లేకుండా సొంత జుట్టుతో నటించారు.

ఆ తర్వాత మనం కోసం వంటి సినిమాల్లో కూడా నటించిన సీత రామయ్య గారి మనవరాలు సినిమా మాత్రం మొదటి చిత్రం గా నిలిచి పోయింది.మీనాకు తాత పాత్రలో అయన నటించగా అక్కినేని నటనకు గాను ఫిలిం ఫేర్ అవార్డు తో పాటు నంది అవార్డు కూడా దక్కించుకున్నారు.

Telugu Actress Meena, Kranthi Kumar, Tollywood-Movie

ఇక ఈ సినిమాలో కథ సగం బలం అయితే సంగీత మరొక అదనపు బలం.కీరవాణి అందించిన సంగీతం వందేళ్లయినా ఎవరు మర్చిపోరు.అంత అద్భుతమైన పాటలను అందించిన ఘనత ఆయనకు దక్కుతుంది.ఇప్పటికి కూడా ఆ పాటలు ఒక ఫ్రెష్ ఫీల్ ని తీసుకు వస్తాయి.ఈ సినిమాలో ఏఎన్ఆర్ అలాంటి మహానటుడి తో మీనా పోటీపడి నటించిన విధానం కూడా అద్భుతం.

Telugu Actress Meena, Kranthi Kumar, Tollywood-Movie

ఈ సినిమాలో వీరిద్దరూ తో పాటు కోట శ్రీనివాస్ రావు మినహా ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేదు.సినిమా కోసం ఎలాంటి స్టార్ డైరెక్టర్ పని చేయలేదు.క్రాంతి కుమార్ అనే ఒక చిన్న దర్శకుడు.

అప్పటికి ఎలాంటి సినిమాలు పెద్దగా తీసినట్టు లేదు.సినిమా కోసం ఉల్లాస పరిచే పాటలే కాదు అంతకు మించి హృదయాంతరాలను హత్తుకునే సంభాషణలు కూడా ఉంటాయి.

కేవలం అక్కినేని, మీనా నటనకు కీరవాణి సంగీతం తోడై సినిమా ఘన విజయం సాధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube