ఆంజనేయుడికి కొసరి కొసరి వడ్డించిన సీతమ్మ.. చివరికి ఏమైందో తెలుసా?

రామాయణంలో హనుమంతుని పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రాముడికి పరమ భక్తుడిగా ఆంజనేయుడిని భావిస్తారు.

 Seethamma Who Served Kosari Kosari To Anjaneya Do You Know What Happened In The End-TeluguStop.com

సీతాపహరణ సమయంలో సీతమ్మ జాడ కనుక్కోవడానికి ఆంజనేయుడు శ్రీ రాముడికి ఎంతో సహాయపడ్డాడు.ఈ విధంగా సీత ను వెతికి తీసుకుని అరణ్యవాసం ముగిసిన తర్వాత అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడైన శ్రీరాముడి వెంటే ఆంజనేయుడు ఉండేవాడు.

అయోధ్యలోని నివసిస్తున్న ఆంజనేయుడు ప్రతిరోజు హనుమ ప్రార్థన తోనే సీతమ్మ మేల్కొనేది.

 Seethamma Who Served Kosari Kosari To Anjaneya Do You Know What Happened In The End-ఆంజనేయుడికి కొసరి కొసరి వడ్డించిన సీతమ్మ.. చివరికి ఏమైందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శ్రీరామచంద్రుడు అంతపురం నుంచి బయటకు వచ్చే సమయానికి ద్వారం బయట నిలబడి ఉంటాడు.

హనుమ అని పిలిచే అవసరం లేకుండా నిత్యం శ్రీ రాముడి వెంట ఉంటూ రాజ్యసభకి వెళ్తాడు.శ్రీరామచంద్రుడు సింహాసనాధీశుడైతే అతని వెనక నిలబడతాడు.శ్రీరాముడు రాత్రి సమయంలో అంతఃపురంలోకి ప్రవేశించగానే ద్వారం దగ్గర రామనామం పలుకుతూ ఆగిపోతాడు.ఈ విధంగా నిత్యం శ్రీరాముడు వెంట ఉన్న ఆంజనేయుడినీ చూసిన సీతమ్మకు అతనిపై ఎంతో జాలి కలుగుతుంది.

మన కోసం ఇంత తపించే ఆంజనేయుడికి మనమేం చేస్తున్నాం అంటూ శ్రీరామచంద్రుని నిలదీసింది.అందుకు శ్రీరాముడు .“తన హృదయంలో నేనూ-నా హృదయములో అతను ….నాలోనే ఉంటూ నన్ను నడిపించేవాడికి కృతజ్ఞత ఎలా చూపించను”అని అనడంతో చాల్లెండి మీ మాటలు హనుమంతు తిని ఎన్ని రోజులైందో ఏమిటో అతనికి నేనే స్వయంగా భోజనం తయారు చేసి వడ్డీస్తానని సీతమ్మ చెప్పింది.

అనుకున్న ప్రకారమే సీత దేవి స్వయంగా వంటలు తయారు చేసి హనుమకు వడ్డిస్తూ, దగ్గర కూర్చుని.తిను నాయనా మొహమాటపడకు అంటుంటే… సరేనమ్మా అంటూ తలదించుకుని భోజనం చేస్తున్నాడు.

సీతాదేవి కొసరి కొసరి వడ్డిస్తుంటే హనుమంతుడు తింటూనే ఉన్నాడు.చివరికి అక్కడున్న పదార్థాలన్నీ అయిపోవడంతో కంగారుతో సీతమ్మ అంతఃపురంలో ఉన్నవారికి తయారుచేసిన భోజనాన్ని తెప్పించింది.

అవి కూడా అయిపోవడంతో సీతాదేవి వైపు ఎంతో నిరీక్షణగా చూసాడు హనుమంతుడు.దీంతో ఎంతో కంగారుగా రోజు ఏమి తింటున్నావు నాయనా అంటూ సీతాదేవి అడగగా… రామనామం తల్లి అంటూ వంచిన తల పైకెత్తి జవాబిచ్చాడు.

ఆంజనేయుడు చెప్పిన సమాధానం విని ఎంతో ఆశ్చర్య పడిన సీతాదేవి నిరంతరం రామ నామం భుజించేది కేవలం ఒక శివుడు మాత్రమే కదా… అంటూ సీతాదేవి హనుమంతుడి వైపు చూడటంతో, అతనిలో ఆ పరమశివుడు కనిపిస్తాడు.శంకరుడే హనుమ… నిత్యం రామ నామ ఆహారంగా స్వీకరించేవాడికి తను ఇంక ఏమిపెట్టగలదు? అని భావించిన సీతాదేవి ఒక ముద్ద అన్నం పట్టుకొని రామార్పణం అని ప్రార్థించి వడ్డించింది.దానిని ఆంజనేయుడు మహా ప్రసాదంగా భావించి కళ్ళకద్దుకుని తిని కడుపు నిండిందమ్మా అన్నదాత సుఖీభవ అన్నాడు.ఆ విధంగా ఆంజనేయుడులోనీ పరమేశ్వరుడిని సీతాదేవి భక్తితో నమస్కరించింది.

#Anjaneya #Seethamma #Srirama #Kosari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

BREAKING/FEATURED NEWS SLIDE