సీత పార్థిపన్ అనాథను ఎందుకు దత్తత తీసుకున్నారు

సీత. తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచయం అక్కర్లేని నటీమణి.ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె నటించింది.కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న రోజుల్లోనే.త‌మిళ ద‌ర్శ‌కుడు, నటుడైన పార్తీప‌న్‌ పెళ్లి చేసుకుంది.1990లో వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.2001 వీరు విడిపోయారు.సుమారు 11 ఏండ్ల పాటు వీరిద్దరి వైవాహిక జీవితం కొనసాగింది.

 Seetha Parthiban Adopted A Boy And Why, Parthiban, Seeta, Adopted A Child, Boy,-TeluguStop.com

అనంతరం పార్తీపన్ ఒంటరిగానే ఉంటున్నాడు.సీత మాత్రం టీవీ నటుడు సతీష్ ను 2010లోనే రెండో వివాహం చేసుకుంది.ఆ బంధం కూడా చాలా కాలం కొనసాగలేదు.2016లో సతీష్, సీత విడిపోయారు.

వీరి వివాహ జీవితాలను కాసేపు పక్కన పెడితే పార్తీపన్ కె.భాగ్య‌రాజా శిష్యుడు.1989లో వచ్చి పుదియ పాదై అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.అనాథ బాలుల అవస్థల గురించి ఈ సినిమాలో చూపించాడు.

ఈ సినిమా కనీవినీ ఎరుగని తీరిలో విజయం సాధించింది.ఈ సినిమా విజయోత్సవ సభలో ఆయన ఓ విషయాన్ని చెప్పాడు.

సినిమాలో చూపించిన మాదిరిగానే తానూ అనాథ పిల్లలను దత్తత తీసుకుంటానని చెప్పాడు.సీతతో వివాహం అయ్యాక.

వీరికి ఇద్దరు అమ్మాయిలు పుట్టారు.ఒకరు కీర్తన, మరొకరు అభినయ.

అనంతరం తన ప్రమాణాన్ని మర్చిపోకుండా.సీత అనుమతితో ఓ అనాథ బాలుడిని దత్తత తీసుకున్నాడు.

అతడికి తన తండ్రి పేరు రాధా కృష్ణ‌న్ అని పెట్టాడు.

Telugu Child, Orphan Child, Divorced, Hiban, Pudiya Padai, Radha Krishna, Satish

ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లు.అనాథ పిల్లలను దత్తత తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన జనాలను కోరాడు.తల్లిదండ్రిలేని పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలన్నాడు.

చెయ్యని తప్పుకు తాము బాధపడుతున్నామని వారు బాధ పడకుండా చేయాలన్నాడు.ఈ విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఆ పిల్లాడి నామ‌క‌ర‌ణోత్స‌వాన్ని చెన్నైలోని మ్యూజియం థియేట‌ర్‌లో భారీ స్థాయిలో నిర్వహించాడు.

సీత‌తో విడిపోయాక పార్తీప‌న్ ముగ్గురు పిల్ల‌ల్నీ త‌నే పెంచాడు.కీర్త‌న‌, అభిన‌య‌ల‌కు పెళ్లిళ్లు చేశాడు.

రాధాకృష్ణ‌న్ తండ్రి దగ్గరే దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube