మొదటి సినిమా ఉయ్యాలా జంపాలా తో అనుకోకుండా హీరో అయిపోయి అంతే యాద్రుచికంగా హిట్ కొట్టేసాడు కుర్ర హీరో రాజ్ తరుణ్ అయితే ఈ హీరో వరసగా ‘ సినిమా చూపిస్తా మావా ‘ , ‘కుమారీ 21 ఎఫ్’ లతో హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకోవడమే కాక మంచి డిమాండ్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.కుమారీ తరవాత విడుదల అయిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలూ సినిమా మాత్రం రాజ్ తరుణ్ కి ఫస్ట్ ఫ్లాప్ ఇచ్చింది అంటున్నారు.
కొత్త డైరెక్టర్ తో రాజ్ తరుణ్ చేసిన ప్రయోగంగా దీనిని చెబుతున్నారు.మూడు వరస హిట్ ల కారణంగా కలక్షన్ లు మాత్రం ఈ సినిమా కి ఓపెనింగ్ ల రూపం లో బాగా వచ్చాయి.
క్రిటిక్ లు మాత్రం ఇది ఒక బోరింగ్ సాగా గా చెబుతున్నారు.శని – ఆదివారాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే కలెక్షన్లు ఉండొచ్చు.
సోమవారం కూడా ఇవి నిలబడితేనే మూవీ హిట్ అయ్యే అవకాశాలున్నాయి.కాకపోతే రాజ్ తరుణ్ కి ఈ సారి హిట్ కొట్టడం అంత ఈజీ కాదు.