బోల్డ్ పాత్రలకి కేరాఫ్ అడ్రెస్ గా టాలీవుడ్ లో కనిపించే నటి సీరత్ కపూర్. తను చేసిన సినిమాలు తక్కువే అయిన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని భాగానే ఆకట్టుకుంది.
రన్ రాజా రన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు లుక్ కాస్తా బోల్డ్ గా ఉండటం వలన స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.అయితే అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.
రీసెంట్ గా ఈ అమ్మడు కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సినిమాలో ఆమె పాత్రకి మంచి మార్కులే పడ్డాయి.
సినిమాలలో కంటే సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్, బికినీ అందాలతో ఎప్పటికప్పుడు సీరత్ కపూర్ తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.ఇదిలా ఉంటే కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా తర్వాత తాజాగా ఈ భామ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.తాజాగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ఈ విషయాలని పంచుకుంది.
తెలుగులో త్వరలో చేయబోతున్న కొత్త సినిమాలో తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని తెలిపింది.ఇప్పటి వరకు చేసిన పాత్రల తరహాలో కాకుండా సాంప్రదాయాలకు విలువ ఇచ్చే ఆంధ్రా అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నాను.
మా వింత గాథ వినుమా సినిమాలో నేను ఎలా ఉండబోతున్నాను మీకు చూపించేందుకు చాలా ఆతృతగా ఉన్నాను.తప్పకుండా మీ అందరిని మరోసారి మెప్పించే విధంగా మీ ముందుకు వస్తానంటూ సీరత్ వ్యాఖ్యలు చేసింది.
ఆరు నెలల తర్వాత మళ్లీ షూటింగ్ లో జాయిన్ అవ్వడం ఆనందంగా ఉందని ప్రస్తతం పలు కథలు వింటున్నాను.మా వింథ గాథ వినుమా కాకుండా మరో సినిమాను త్వరలో ఓకే చేస్తానంటూ కూడా ఈమె పేర్కొంది.