దుండగులు సీన్ రివర్స్ అవ్వడం తో పరుగు  

Seen Like In The Movies At Hotel In Rajasthan-

తాడిని తన్నే వాడు ఉంటే వాడిని తల తన్నే వాడు ఒకడు ఉంటాడు అన్న సామెత వినే ఉంటారు.మనం పెద్ద తోపులం అని పొతే మన ఎదుటివారు అంతకంటే తోపులు అయినప్పుడు తోక ముడుచుకొని పోవాల్సిందే.సరిగ్గా ఇలాంటి ఘటనే రాజస్తాన్ లో చోటుచేసుకుంది...

Seen Like In The Movies At Hotel In Rajasthan--Seen Like In The Movies At Hotel Rajasthan-

రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో ఒక ముఠా మరొక ముఠా పై దాడి చేయడం కోసం ప్లాన్ చేశారు.అయితే ప్లాన్ ప్రకారం అందరూ ముసుగులు ధరించి పెద్ద ఆర్భాటంగా కారు లో, జీపు లో కొందరు దుండగులు ఒక హోటల్ వద్దకి చేరుకున్నారు.హోటల్ లో ఉన్న మరో గ్యాంగ్ పై దాడి చేయాలనీ వారంతా కలిసి హోటల్ లోపలకి వెళ్లి రెచ్చిపోదాం అనుకున్నారు.

కానీ ఇక్కడే కధ అడ్డం తిరిగింది,పెద్ద తోలుపులుగా లోపలికి పోయిన ముఠా కంటే కూడా అవతలి ముఠా లో మరింత ఎక్కువ మంది దుండగులు ఉండడం తో వాళ్ళు రివర్స్ లో వీరిపై కర్రలతో దాడికి తెగబడడం తో దెబ్బకి ఈ ముఠా తోక ముడుచుకొని పరుగు లంఖించింది.

Seen Like In The Movies At Hotel In Rajasthan--Seen Like In The Movies At Hotel Rajasthan-

అయినా అవతలి ముఠా సభ్యులు వారిని వదిలిపెట్టకుండా బయటవరకు వచ్చి తరిమి తరిమి కొట్టారు.అయితే ఈ ఘటన మొత్తం హోటల్ బయట ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడం తో ఇప్పుడు ఈ వీడియో బయటకొచ్చింది.ఆ హోటల్ యజమాని కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం తో ఇప్పుడు ఆ రెండు ముఠాల కోసం వారు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది.