ఆ వీడియోల‌తో పైశాచికానంద‌మా... క‌ట‌క‌టాలే..!

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా పోర్న్ వీడియోల‌కు ఎంత డిమాండ్ ఉందో.పోర్న్ చూసే వారి సంఖ్య ఎంత‌లా పెరిగిపోతుందో చెప్ప‌క్క‌ర్లేదు.

 Police Will Arrest For Seeing Porn Videos, Sexual Videos, Uploading, Crime, Cent-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే కొత్త కొత్త పోర్న్ వీడియోల‌కు ఎక్కువుగా డిమాండ్ ఉంటోంది.ఇక చాలా మంది అశ్లీల ఫొటోలు, వీడియోలు సేక‌రించి వాటిని సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు.

ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా వేలాది పోర్న్‌సైట్ల‌ను నిషేధించినా చాటుగా చూస్తోన్న వారి సంఖ్య త‌క్కువేం కాదు.అంతెందుకు క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో పోర్న్ సైట్లు, కొత్త పోర్న్ వీడియోలు ల‌క్ష‌ల్లోనే పుట్టుకు వ‌చ్చాయ‌ని నివేదిక‌లు చెపుతున్నాయి.
ఇలాంటి కామాంధుల ఆట‌లు క‌ట్టించేలా క‌ర్నాట‌క‌ పోలీసులు సరికొత్త స్కెచ్ వేశారు.ఎవ‌రు అయితే అశ్లీల ఫొటోలు, వీడియోలు సేక‌రించి వాటిని చాటుగా సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారో వారిని గుర్తించి వారి ఆట‌క‌ట్టించే విష‌యంలో క‌ర్నాక‌ట పోలీసులు స‌రికొత్త సాంకేతిక‌త‌ను కూడా వాడుకుంటున్నారు.

ఇక దేశంలో యువ‌తులు, చిన్నారులు, మ‌హిళ‌ల‌పై లైంగీక దాడులు జ‌ర‌గ‌డంలో ఈ పోర్న్ సైట్ల పాత్ర కూడా ఎక్కువే.ఈ క్ర‌మంలోనే ఇలాంటి వీడియోల‌పై నిఘా పెట్టే పోలీసులు గూగుల్ వాళ్ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ట‌చ్‌లో ఉంటూ వీరు ఈ వీడియోలు ఏ ఐపీ ద్వారా అప్‌లోడ్ చేస్తున్నారో గుర్తించి వారిని పట్టుకుంటున్నారు.

ఇక బెంగ‌ళూరులో బాల‌ల అశ్లీల వీడియోలు పోస్ట్ చేస్తోన్న ఉడిపికి చెందిన సౌర‌వ్ శెట్టి అనే యువ‌కుడిని సైబ‌ర్ క్రైం పోలీసులు ఇలాగే అరెస్టు చేశారు.ఇక న‌గ‌రంలోని చామ‌రాజ‌పేట‌లో కూడా ఓ వ్య‌క్తి ఇదే త‌ర‌హాలో అశ్లీల వీడియోలు పోస్టు చేస్తుండ‌డంతో ఇదే ప‌ద్ధ‌తిలో ప‌ట్టుకున్నారు.

ఈ ప‌ద్ధ‌తిలో గూగుల్ ముందుగా ఎవ‌రు అయితే అశ్లీల వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారో త‌న వ‌ద్దనున్న అత్యాధునిక టెక్నాల‌జీతో స‌మాచారం సేక‌రించి కేంద్ర హోంశాఖ కు తెలియజేస్తుంది.ఆ త‌ర్వాత కేంద్ర హోం శాఖ ఆ విష‌యం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఇస్తే రాష్ట్రాల పోలీసులు ఐపీ అడ్రెస్, చిరునామా ఆధారంగా వారు ఎక్క‌డున్నా ప‌ట్టుకుని అరెస్టు చేస్తారు.

సో ఇక‌పై ఇలాంటి ప‌నులు చేసే వారూ త‌స్మాత్ జాగ్ర‌త్త‌.!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube