రమ్యకృష్ణను అలా చూసేసరికి ఏడుపొచ్చింది... ఎమోషనల్ అయిన కృష్ణవంశీ!

Seeing Ramyakrishna Like That She Cried Emotional Krishnavamshi, Krishnavamsi, Ramyakrishna, Ranga Marthanda Movie, Tolltwood , Rangamarthanda

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishnavamsi)చాలా గ్యాప్ తర్వాత రంగ మార్తాండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ( Prakash Raj, Brahmanandam )వంటి సెలబ్రిటీలు కీలక పాత్రలో నటిస్తున్నారు.

 Seeing Ramyakrishna Like That She Cried Emotional Krishnavamshi, Krishnavamsi, R-TeluguStop.com

ఇక ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుని ఈనెల 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

Telugu Krishnavamsi, Ramyakrishna, Ranga Marthanda, Rangamarthanda, Tolltwood-Mo

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన రమ్యకృష్ణ( Ramyakrishna) గురించి పలు విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశానని తెలిపారు.ఇక మా ఇంట్లో ఏ నిర్ణయం రమ్యకృష్ణనే తీసుకుంటుంది.

ఇక తను లేకపోతే ఆ నిర్ణయాన్ని మేము తీసుకుంటాము మేము తీసుకున్న నిర్ణయంలో కూడా రమ్యకృష్ణ కొన్ని మార్పులు చెబుతూ ఉంటుందని తెలిపారు.కానీ వాటి గురించి మేము పెద్దగా పట్టించుకోమని తెలిపారు.

Telugu Krishnavamsi, Ramyakrishna, Ranga Marthanda, Rangamarthanda, Tolltwood-Mo

ఇకపోతే రమ్యకృష్ణ నటన గురించి మాట్లాడుతూ రమ్యకృష్ణ ఈ సినిమాలో తన శక్తి అరుపులతో కాకుండా కళ్ళతో నటించాల్సి ఉంటుందని చెప్పగానే వెంటనే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుందని తెలిపారు.ఇక ఈ సినిమాలో తన మేకప్ తానే వేసుకుందని ఆమె ఎప్పుడూ కూడా ఒక విజన్ తోనే ముందుకు వెళుతుందని కృష్ణవంశీ తెలిపారు.ఇకపోతే ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ చేసే సమయంలో తాను నరకం అనుభవించానని కృష్ణవంశీ తెలిపారు.ఈ సినిమా క్లైమాక్స్ దాదాపు 36 గంటల పాటు చిత్రీకరణ జరిగిందని తెలిపారు.

రమ్యకృష్ణను ఆ సీన్ లో చిత్రీకరించడానికి నాకు సెంటిమెంట్ అడ్డొచ్చింది.కానీ తప్పదు.

రమ్యకృష్ణను అలా చూసేసరికి ఏడుపొచ్చింది కానీ గుండె రాయి చేసుకుని షూటింగ్ చేశానని అయితే ఆ రోజు రాత్రి మొత్తం తనకు నిద్ర పట్టలేదని చెబుతూ కృష్ణవంశీ కంటతడి పెట్టుకున్నారు.ఇలా రంగమార్తాండ( Rangamarthanda ) క్లైమాక్స్ గురించి కృష్ణవంశీ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube