సీద్ శ్రీరామ్ 'సాంగ్'కు మరో వర్షన్ ఉందట.. కానీ?- Seed Shriram Song Has Another Version But

seed shriram song has another version but sid sriram, Chandrabose, Shashi, Arun Chiluveru , tollywood, chandra bos - Telugu Arun Chiluveru, Chandrabose, Shashi, Sid Sriram

ఇటీవలే యంగ్ హీరో ఆది నటించిన శశి మూవీ విడుదలైన సంగతి తెలిసిందే.శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

 Seed Shriram Song Has Another Version But-TeluguStop.com

ఇక ఈ సినిమాలో విడుదలైన పాటలు మాత్రం ఓ రేంజ్ లో హిట్ అందుకున్నాయి.అంతేకాకుండా ఈ సినిమాలో ఓ పాట ఇప్పటికీ బాగా ట్రెండ్ గా ఉంది.

,/br>

 Seed Shriram Song Has Another Version But-సీద్ శ్రీరామ్ సాంగ్’కు మరో వర్షన్ ఉందట.. కానీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ ఆ పాట ఏంటంటే సిద్ది శ్రీరామ్ పాడిన ఒకే ఒక లోకం నువ్వేపాట.ఈ పాట విడుదలైన 30 రోజుల్లో ఏకంగా 30 మిలియన్ ల మంది వీక్షించారు.ఇప్పటికీ ఈ పాట ఇంకా ఆకట్టుకుంటూనే ఉంటుంది.కానీ ఈ పాటకు మరో వెర్షన్ ఉందన్న సంగతి ఎవరికీ తెలియకపోవచ్చు.

సింగర్ చంద్రబోస్ ఈ పాట లిరిక్స్ అందివ్వగా అరుణ్ చిలువేరు మ్యూజిక్ అందించాడు.ఇక ఈ సినిమాలో ఈ పాటను సింగర్ సిద్ద్ శ్రీరామ్ పాడిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ పాటకు ముందు మరొక వెర్షన్ ఉందని సింగర్ చంద్రబోస్ ఇటీవలే తను విడుదల చేసిన వీడియో ద్వారా తెలిపాడు.

ముందుగా ఈ పాట మంచి విజయాన్ని అందుకున్నందుకు ఆయన ఎంతో గొప్పగా మురిసిపోతున్నానని తెలిపాడు.ఇక ఈ పాట రూపకల్పనకు చిన్న సరదా సంఘటన జరిగిందని తెలిపారు.ఇక ఈ పాటను వినిపించిన అరుణ్ చిలువేరు ముందుగా చంద్రబోస్ దగ్గరికి వెళ్లి వినిపించాడట.

ఇక ఈ పాట బాగుందని చంద్రబోస్ తెలుపగా కొన్ని సందర్భాలు బట్టి పాట పాడి వినిపించమని అరుణ్ కోరగా ముందు ఒక వెర్షన్ లో వినిపించాడంట చంద్రబోస్.ఇక ఈ పాట చరణాలు బాగా నచ్చగా పల్లవి లో కొన్ని మార్పులు చేయాలని అరుణ్ కోరాడట.

దీంతో చంద్రబోస్ నీకు ఎలా ఉండాలో చెబితే అలాగే పాడుతానంటూ అడుగగా వెంటనే ఆయన తనకు ‘నువ్వు, ఎదురుగా ఉంటే, వసంతం’ వంటి ఇలాంటి మాటలతో పల్లవి కావాలని కోరాడట.

దీంతో చంద్రబోస్ మరో వెర్షన్ లో పాటను వినిపించగా ఆ పాట అరుణకి నచ్చిందట.

కానీ చంద్రబోస్, అరుణ్ కు ఆ పాట అందించాను కానీ.ఆ పాటకి కావాల్సింది ఇవ్వలేదంటూ ఆ పాటకు ఏదైనా అందించాలి అనుకుంటూ ఆ రోజు రాత్రంతా మరో వెర్షన్ లో రూపొందించానని ఆ పాటే ఒకే ఒక లోకం నువ్వే అని చంద్ర బోస్ తెలిపారట.

ప్రస్తుతం ఈ పాట ముందు వెర్షన్ వినాలంటే చంద్ర బోస్ పంపిన వీడియో ను చూడాల్సిందే.

#Arun Chiluveru #Chandrabose #Sid Sriram #Shashi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు