ముసలోడేగాని మహానుభావుడు... ఈ వయస్సులో కూడా బైక్ స్టంట్స్ చేస్తున్నాడు చూడండి!

See The Old Man Doing Bike Stunts Even At This Age Old Man,stunts , Bike Stunts Viral, Latest News, Viral Latest, News Viral, Social Media, Viral Video

ఈతరం కుర్రాళ్ళు 30 ఏళ్లకే ముసలైపోయిన పరిస్థితి.అదేనండి గ్యాస్ ట్రబుల్స్ అని, ముడుకులు నొప్పులు అని, చూపు సరిగ్గా లేదని, నడుం నొప్పంటూ ఇలా రకరకాల కారణాలు చెప్పి చేయవలసిన పనులను వాయిదాలు వేస్తూ గడిపేస్తూ వుంటారు.

 See The Old Man Doing Bike Stunts Even At This Age Old Man,stunts , Bike Stunts-TeluguStop.com

అలాంటిది ఓ 70 ఏళ్ల తాత చేసిన పనిని చూసి ఖచ్చితంగా సిగ్గు పడాలి.ఈ వయసులో కూడా అతని హుషారు చూసి నేటి యువకులు బేజారు అయిపోవాలి.

అవును, ఇక్కడ వైరల్ అవుతోన్న తాతను చూసి నేటితరం స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా వుంది.

అంటే ఇక్కడ అతనిలా బైక్ స్టెంట్స్( Bike stunts ) చేయమని చెప్పడం అస్సలు ఉద్దేశం కాదు.అతనిలోని చలాకీతనం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.70 ఏళ్ల వయసుగల ఆటగాడు కుర్రాళ్లకు ధీటుగా బైకు మీద వెళ్తున్న తీరుని చూస్తే ఎంతటివారికైనా ఆహా అనిపించక మానదు.ఇందుకు సంబందించిన వీడియో ఇపుడు సోషల్ మీడియా( Social media )లో తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో ఓ వృద్ధుడు బైక్‌తో రోడ్డుపై స్టంట్స్ వేయడం మనం చూడవచ్చు.

మొదటగా అతను బైక్ హ్యాండిల్‌ని విడిచిపెట్టాడు.ఆపై బైక్‌పై డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తాడు.

అక్కడితో ఆగకుండా బైక్‌పై జంప్ కూడా చేస్తాడు.అంతేనా, వెనకాలకు వంగి చేతులను కూడా ఊపుతాడు.లేచాక రెండు చేతులతో బైక్‌పై మరలా డాన్స్ చేస్తాడు.బైక్‌పై ఇన్ని స్టంట్స్ చేసినా ఆ వృద్ధుడు కిందపడకపోవడం కొసమెరుపు.కుర్రాళ్లు కూడా చేయలేని రీతిలో తాత స్టంట్స్ చేసి నెటిజన్లతో ఈలలు వేయించుకున్నాడు.ఈ వీడియోని ‘అజిత్ నావగానే ఆఫీసియల్ 07‘ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌( Instagram ) ఖాతాలో అప్‌లోడ్ చేయగా ఈ వీడియోకి నెట్టింట లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది.

వారం క్రితమే పోస్ట్ చేసిన ఈ వీడియోకి భారీ స్థాయిలో లైకులు రావడం విశేషం.కాగా ఈ వీడియో చూసిన అందరూ బైక్‌పై తాత స్టంట్స్ చూసి షాక్ అయిపోతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube