పిల్లులు చాలా తెలివైనవి.వీటి స్మార్ట్నెస్ చూస్తే ఎవరైనా సరే అవాక్కవాల్సిందే.
ఇప్పటికే పిల్లులు ఎన్నో రకాల తెలివైన పనులు చేసి మనల్ని ఆశ్చర్యపరిచాయి.వీటికి బై బర్త్ చీకటిలో కదలికలను గమనించడం, అతి చిన్న శబ్దాలను గ్రహించడం సుదూర ప్రాంతాలలోని వాసనను ట్రాక్ చేయడం, నచ్చిన ప్రదేశాలను గుర్తించుకోవడం తదితర సామర్థ్యాలు ఉంటాయి.
అలాగే ఒక ప్లేస్ నుంచి ఎస్కేప్ కావడానికి, ఫుడ్ ఎక్కడున్నా ఈజీగా పొందేందుకు ఇవి తమ తెలివిని ఉపయోగించి ప్రయోజనాలు పొందుతుంటాయి.
కాగా తాజాగా ఒక పిల్లి ఒక క్యాన్లో ఉన్న ఫుడ్ తినేందుకు ఒక తెలివైన పనిచేసింది.
దానికి సంబంధించిన వీడియోను @yoda4ever అనే ఒక ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.షేర్ చేసిన సమయం నుంచి దీనికి ఇప్పటికే 9 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.44 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక పిల్లి తెల్ల క్యాన్ మూతను తన ముందరకాలితో తీస్తుండటం చూడవచ్చు.
పిల్లి మూతను మొత్తం తిప్పేసిన తర్వాత దాన్ని పక్కన పడేసింది.ఆపై ఆ క్యాన్ మూతి పై ఉన్న మరో మూతను తీసేందుకు అది నోటిని ఉపయోగించింది.నోటి పళ్ళతో ఆమూతను కూడా పట్టుకుని పక్కన తీసి పారేసింది.ఆ తర్వాత పెళ్లి అందులోని ఫుడ్ లాగించి ఉంటుందని తెలుస్తోంది.అయితే మూత ఇలా తీయాలని పిల్లి తెలుసుకోవడానికి చూసి మెడిసిన్లు ఆశ్చర్యపోతున్నారు.దాని తెలివికి వావ్ అంటున్నారు.
మీరు కూడా ఈ వీడియోని వీక్షించండి.