ఈ బిల్డింగును సముద్రం ఎలా మింగేసిందో చూడండి..!

కొన్ని కొన్ని వీడియోలు చూస్తే ఆశ్ఛ‌ర్యానికి గురి కావాల్సిందే.వింత వింతవి ప్ర‌పంచంలో ఎక్కడ జ‌రిగిన సీసీ కెమెరాలు వ‌చ్చే స‌రికి అవి వైర‌ల్‌గా మారుతున్నాయి.

 See How The Sea Swallowed This Building-TeluguStop.com

సీసీ కెమెరాల్లో దాగున్న వాటిని షేర్ చేసి అంద‌రిని ఆశ్ఛ‌ర్యానికి గురి చేస్తున్నారు.అయితే కొన్ని కొన్నింటిని చూస్తే ఒళ్లు పుల‌క‌రిస్తుంది.

కొన్నింటిని చూస్తే న‌వ్వొస్తుంది.మ‌రికొన్ని వీడియోల్లో భ‌యాన‌కానికి గుర‌వుతాం.

 See How The Sea Swallowed This Building-ఈ బిల్డింగును సముద్రం ఎలా మింగేసిందో చూడండి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాంటి వీడియోలు నెట్టింట్లో వైర‌ల్‌గా మారుతున్నాయి.మ‌రికొన్నివీడియోలను చూస్తే అయ్యో పాపం అంటారు.

అలాంటి సంఘ‌ట‌న ఒక‌టి అర్జెంటీనాలో జ‌రిగింది.ఓ రెండు అంతస్తుల బిల్డింగ్‌ను సముద్రం లోపలికి లాగేసుకుంది.

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.సముద్ర మట్టం పెర‌గ‌డంతో భవన నిర్మాణం బలహీనపడి సముద్రంలో జారింది.

భ‌వ‌న నిర్మాణం స‌రిగా నిర్మించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇలా జ‌రిగింది.అందుకే స‌ముద్రం ద‌గ్గ‌ర ఇండ్లు క‌ట్టుకోవ‌ద్ద‌ని సూచిస్తారు.

జూలై 28న రాజధాని బ్యూనెస్ ఏర్స్‌లోని మార్ దెల్ ట్యుయూ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కాకాపోతే ఎవ‌రికీ ఏ ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు.దాంతో అంద‌రూ హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకున్నారు.మ‌నం చూస్తున్న ఈ వీడియోలో సముద్రపు అలలు వేగంగా భవన గోడలను బ‌లంగా తాకుతుంటాయి.

దాంతో అలల తాకిడికి భవనం కింది భాగమంతా సముద్రంలోకి ఒరిగింది.

ఇందులో అదృష్ట‌మేమిటంటే, ఘటన సమయంలో ఆ భవనంలో ఎవరూ లేరు.దాంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానిక నివేదికలు వెల్లడించాయి.ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఒక‌వేళ అందులో జ‌నాలు ఉంటే ప‌రిస్థితి ఎంత భ‌యాన‌కంగా ఉంటుందో ఆలోచిస్తేనే భ‌యం వేస్తుంది.ఇటువంటి ప్ర‌మాదాల‌ను ముందే గ‌మ‌నించి జాగ్ర‌త్త ప‌డాలి.

ప్ర‌స్తుతం ఆ వీడియోలో ముందు జాగ్ర‌త్తే వారిని ర‌క్షించింద‌ని మ‌న‌కు చూస్తే తెలుస్తోంది.

#WeakBuilding #Social Media #Viral Video #Viral #Houses Near Sea

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు