ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒలంపిక్స్ ముచ్చటనే.సోషల్ మీడియాలో, టీవీలల్లో, పేపర్‌లలో, నెట్టింట్లో అంతటా ఒకటే మాట అదే ఒలంపిక్స్‌ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి క్రీడాకారులు వారి సత్తా చాటుతారు.
ప్రతి క్షణం ఉత్కంఠగా సాగే ఈ సమరంలో ప్రేక్షకులు ముని వేళ్లపై నిలబడి చూస్తున్నారు.అలాంటి ఒలంపిక్స్‌ను క్రీడా అభిమానులంతా టీవీలకు అతుక్కుపోయి మరీ చూస్తున్నారు.
తమ దేశం తరఫును ఆడుతున్న క్రీడాకారులనే కాకుండా ఇతర దేశస్థుల క్రీడాకారుల ఆటలను ఎగబడి చూస్తున్నారు.ఎంతో ఉత్కంఠతో సాగే ఈ గేమ్స్‌ను చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు క్రీడా అభిమానులుతమకు నచ్చిన ప్లేయర్ పతకం సాధించాలని చాలా కుతూహలంతో చూస్తున్నారు.
కొన్ని మ్యాచ్‌లను చూస్తే ఇలాంటి గేమ్ చూడకపోతే జీవితం వేస్ట్ అన్నట్టు ఉంటున్నాయి.ఇక్కడ ఇంకో ట్విస్టు ఏమిటంటే ఒలంపిక్స్ కేవలం మనుషులకే పరిమితం కాలేదు.
జంతువులు సైతం ఒలంపిక్స్ గేమ్స్‌ను ఇష్టపడుతున్నట్టు ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
అసలు విషయమేంటంటే టీవీలో ఒలంపిక్స్ ప్రసారమవుతుంటే ఓ పిల్లి ఎంతో ఆసక్తిగా టీవీని చూస్తోంది.
టీవీలో ప్లేయర్స్ ఆడుతున్న విధంగా పిల్లి చేసే హావభావాలు నెటిజెన్లను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.టీవీలో ప్లేయర్స్ చేస్తోన్న విన్యాసనాలను చూస్తూ తెగ ఎంజాయ్ చేసింది.అంతేకాకుండా ప్లేయర్స్‌ను పట్టుకోవడానికి పిల్లి ప్రయత్నిస్తోన్న తీరును చూసి అందరూ సరదాగా నవ్వుకుంటున్నారు.
అయితే పిల్లి చేసిన ఈ విన్యాసాలను దాని యజమాని సెల్ ఫోన్‌లో బంధించాడు.హ్యూమర్ అండ్ ఎనిమల్స్ పేరుతో ఉన్న ట్విట్టర్ హాండిల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఆటలను మనుషులే కాదు మూగ జీవాలు కూడా చూస్తాయని నిరూపించింది ఈ పిల్లి.ఈ వీడియోను మీరు ఒకసారి చూస్తే నవ్వు ఆపుకోలేరు.