ఒంటి చేత్తో డ‌బ్బాల‌ను ఎలా ప‌గ‌ల‌గొడుతున్నాడో చూడండి..!

బాడీ ఎంతుంది అనేది కాదురా బ‌ల‌మెంతుంది అనేదే పాయింట్ అనే డైలాగ్ కొంద‌రికి మాత్ర‌మే సూట్ అవుతుంటాయి క‌దా.నిజ‌మే ఎందుకంటే వారు చూడ‌టానికి మ‌రీ లావుగా లేక‌పోయినా వారు కొడితే మాత్రం బాక్సులు బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే.

 See How One Can Break A Can With One Hand-TeluguStop.com

చాలామంది అస‌లు లావుగా ఉన్న వారికే బ‌లం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అనుకుంటారు కానీ నిజానికి బ‌లం అనేది మ‌న చేతుల్లోనే ఉంటుంది.మ‌నం చేసే ప‌నే మ‌న‌ల్ని ఇనుప రాడ్డుల్లాగా మారుస్తాయి.

ఇక అలా ఇనుప రాడ్డుల్లాంటి చేతుల‌తో ఎంతోమంది ఎన్నో ర‌కాల రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టారు.

 See How One Can Break A Can With One Hand-ఒంటి చేత్తో డ‌బ్బాల‌ను ఎలా ప‌గ‌ల‌గొడుతున్నాడో చూడండి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు కూడా ఒక వ్యక్తి త‌న‌కున్న ఉక్కులాంటి చేతుల‌తోనే సెన్సేష‌న‌ల్ రికార్డ్ ల‌ను బ‌ద్ద‌లు కొడుతున్నాడు.

మ‌న ప‌క్క‌నే ఉండే కేరళ రాష్ట్రానికి చెందిన కేఆర్ జాన్ పాల్ అనే ఈ యువ‌కుడు ఏకంగా త‌న చేతుల‌తోనే అద్భుతాలు సృష్టిస్తున్నాడు.త‌న ఉక్కులాంటి పిడికిలితో ఏకంగా కూల్ డ్రింక్ డబ్బాల‌ను ఇట్టే పగలగొట్టాడు.

అయితే తాను అలా ఒక్కటి రెండు కాదండోయ్‌.ఏకంగా 30 సెకన్లలో దాదాపు 52 గ‌ట్టి డబ్బాలను బెలూన్ల‌ను బద్దలు కొట్టినట్టే ప‌గ‌ల‌గొట్టాడు.

దీంతో ఈ జాన్ ఏకంగా ప్రపంచ రికార్డును బ‌ద్ద‌లు కొట్టేశాడు.

అయితే ఇక్కడ మరో విష‌యం ఏంటంటే జాన్ ఈ విధంగా కూల్ డ్రింక్ డబ్బాలను ప‌గ‌ల‌గొట్టే ట‌ప్పుడు మ‌రో క్లిష్ట‌మైన ప‌ని కూడా చేశాడు.అదేంటంటే త‌న చేతిలో ఓ కోడి గుడ్డును పెట్టుకుని దాన్ని ప‌గ‌ల‌నీయ‌కుండా చాల జాగ్ర‌త్త‌గా డ‌బ్బాల‌నుక్రష్ చేసేశాడు.ఇక ఈ వీడియో చూసిన వారంతా అతడి చేతులు సుత్తి కంటే బలమైనవంటే తెగ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

ఇక‌పై ఎవ‌రు కూడా అతని రికార్డ్ బ్రేక్ చెయ్య‌లేర‌ని, ఎందుకంటే అంత ఈజీ టాస్క్ కాదంటూ నెటిజ‌న్లు ఆయ‌న్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.మ‌రి మీరు మాత్రం ఇలాంటివి ట్రై చేయ‌కండి.

#Kr John Paul #Hand Power #Baloons #Kerala Man #BreaksWorld

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు