ఆ కన్నడ వ్యక్తికి బాలకృష్ణ అంటే ఎంత అభిమానమో చూడండి.. దేవుడి ప్లేస్‌లో బాలయ్య

కొందరు అభిమానులు తమ అభిమాన నటుడిని దేవుడి కంటే ఎక్కువగా పూజిస్తారు.దేవుడి స్థానంలో ఆ హీరోను పెట్టుకుని పూజించేలా కొందరు అభిమానిస్తూ ఉంటారు.

 See How Much Love To Kannada Person On Balakrishna-TeluguStop.com

అలా చేసే వారిని చూస్తే బాబోయ్‌ మరీ ఇంత అభిమానమా అనిపించక మానదు.తాజాగా నందమూరి బాలకృష్ణను అభిమానించే ఒక ఫ్యాన్‌ చేసిన పని కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

బాలకృష్ణ అభిమాని తన కొడుకు పెళ్లి సందర్బంగా పెళ్లి కార్డుపై బాలకృష్ణ ఫొటోను వేయించాడు.అయితే అతడు తెలుగు వ్యక్తి కాకపోవడం మరింత విడ్డూరం, కర్ణాటకకు చెందిన ఫ్యాన్‌ అవ్వడంతో ఈ వార్తకు మరింత ప్రాముఖ్యత చేకూరింది.

తెలుగు రాష్ట్రాల్లో బాలయ్యకు వీరాభిమానులు ఉంటారు అంటే సరే అనుకోవచ్చు.కాని బాలకృష్ణకు కర్ణాటకలో కూడా వీర వీర అభిమానులు ఉంటారు.సీడెడ్‌ స్థాయిలో కర్ణాటకలో బాలయ్య సినిమాలు వసూళ్లను దక్కించుకుంటాయి.తాజాగా కర్ణాటకకు చెందిన బాలకృష్ణ అభిమాని అయిన శ్రీనివాసులు తన కొడుకు పెళ్లి చేసేందుకు సిద్దం అయ్యాడు.

ఆయన కొడుకు పెళ్లి ఇన్విటేషన్‌ కార్డుపై బాలకృష్ణ ఫొటో అచ్చు వేయించాడు.మామూలుగా అయితే పెళ్లి కార్డుపై దేవుడి బొమ్మలు వేస్తారు.

కాని బాలకృష్ణపై అభిమానంతో పెళ్లి కార్డుపై బాలయ్య ఫొటో వేయించుకున్నాడు.

ఆ కన్నడ వ్యక్తికి బాలకృష్ణ అం�

ఈనెల 13న జరుగబోతున్న పెళ్లికి నందమూరి అభిమానులు అంతా కూడా ఆహ్వానితులే అంటూ వేశాడు.బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ కొడుకును ఆశీర్వదించాలని శ్రీనివాసులు కోరడం జరిగింది.ఈ వింత ఇన్విటేషన్‌ కార్డును అందుకున్న జనాలు ఆశ్చర్యపోతున్నారు.

బాలయ్య కర్ణాటకలో కూడా ఏ స్థాయిలో జెండా పాతాడో ఈ సంఘటనతో అర్థం చేసుకోవచ్చు.అద్బుతమైన ఈ విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube