ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో ‘బుల్లెట్టు బడ్డెక్కి వచ్చేస్తున్న’ సాంగ్‌కు ఓ పెళ్లి కూతురు డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట ట్రెండయిన సంగతి అందరికీ విదితమే.
కాగా, తాజాగా మరో వీడియో వైరలవుతోంది.అయితే, ఈ వీడియోలో నవ వధువు తన తండ్రితో అత్యద్భుతంగా డ్యాన్స్ చేసింది.
ఆ వీడియో వివరాల్లోకెళితే.జీవితంలో జరిగే మధురమైన ఘట్టం ‘పెళ్లి’.
ఈ వేడుక అతిథులు, బంధుమిత్రుల మధ్య అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకోవాలని ప్రతీ ఒక్కరు అనుకుంటారు.ఇక ఈ సందర్భంలో జరిగే ప్రతీ మూమెంట్ జీవితాంతం గుర్తుంచుకోవాలనుకుంటారు.
సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలో నవ వధువు తన తండ్రితో ‘సంగీత్’ వేడుకలో చేసిన అదిరిపోయే డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.తన ముద్దుల కూతురుతో తండ్రి సంతోషంగా, హుషారుగా వేసిన డ్యాన్స్ స్టెప్పులు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ తండ్రీ కూతుళ్ల డ్యాన్స్ స్టెప్స్ మనసులను హత్తుకునే విధంగా ఉన్నాయని, ప్రేమానురాగాలతో గారాలపట్టియైన తన కూతురును తండ్రి పెంచుకున్నట్లు అనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఈ తల్లీ కూతుర్ల వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండవుతోంది.
‘వెడ్‌గోఈజీ’ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తన అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరలవుతోంది.
సాధారణంగా తండ్రులు ఎవరైనా కూతురు పెళ్లి అవుతుందని ఓ వైపు ఆనందిస్తూనే, మరో వైపు దు:ఖంలో మునిగిపోతుంటారు.తన గారాల పట్టి ఇక తన ఇంట్లో ఉండబోదని, పండుగలకు మాత్రమే హాజరవుతుంటుందని ధు:ఖసాగరంలో మునిగిపోతుంటాడు.ఈ క్రమంలోనే పెళ్లి జరుగుతున్నందుకు ఆనందం కూడా వ్యక్తం చేస్తుంటాడు.
అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో తండ్రి కూతురి పట్ల ప్రేమను ఇలా డ్యాన్స్ చేస్తూ వ్యక్తపరిచినట్లు కనబడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతీ ఇంట్రెస్టింగ్ సంఘటన వైరల్ అవుతుంటుండగా, ఈ సూపర్బ్ వీడియో కూడా వైరలవుతోంది.
అయితే, ఈ పెళ్లి ఏ ఏరియాలో జరిగింది? వధువు పేరేంటి? తండ్రి ఏం చేస్తుంటారు? అనే విషయాలు తెలియరాలేదు.