తులసి చర్మానికి ఎన్ని రకాలుగా పనికివస్తుందో చూడండి  

See How Basil Leaves Can Help Your Skin-

తులసి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం లాంటిది.వేల సంవత్సరాలుగా వైద్యరంగంలో ఒక అంతర్లీన భాగంగా ఉంటూ వస్తోంది తులసి.మరి అలాంటి అద్భుత ఔషధాన్ని మనం ఇంట్లోనే పెంచుకుంటాం కాని సరిగా ఉపయోగించుకోవాలంటే మాత్రం బద్ధకం.కాస్త ఆ బద్దకాన్ని వీడి తులసిని చర్మ ఆరోగ్యానికి ఎలా ఉపయోగించుకోవాలో చూడండి.

See How Basil Leaves Can Help Your Skin---

* చర్మం వదులుగా ఉంటే, తులసి బాగా ఉప్దయోగాపడుతుంది.తులసి ఆకులను 5 నిమిషాలపాటు మరిగించి,ఆ తరువాత దాంట్లోకి రోజ్ వాటర్ కలిపి, కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలిపి ఓ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు.దీన్ని రోజు ముఖానికి పడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.* రక్తం క్లీన్ గా లేకపోతె కూడా రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి.అలాటప్పుడు రోజు తులసి ఆకులను తినే అలవాటు చేసుకోవాలి.రక్తం శుద్ధి చేయబడి చర్మం ఆరోగ్యాన్ని పొందుతుంది.* దురదతో ఇబ్బందిపడేవారు కూడా తులసిని ఆశ్రయించవచ్చు.తులసి ఆకులను దంచి, దాంట్లోకి కొంచెం నిమ్మరసం కలుపుకొని దురద ఉన్న చోట పట్టాలి.* చర్మం మీద ఇన్ఫెక్షన్స్ తో బాధపడేవారు ఆవనునేలోకి కొన్ని తులసి ఆకులని తీసుకొని, నూనె చిక్కబడే వరకు మరిగించి, ఆ తరువాత వడపోసి చర్మానికి రాసుకోవాలి.

* తులసి ఆకులని కొబ్బరినూనెలో మరిగించి, చాలార్చిన తరువాత ఆ మిశ్రాన్ని కాలిన గాయాలపై ఉపశమనం కోసం రాసుకోవచ్చు.