వాట్సాప్‌లో బయట పడ్డ సెక్యూరిటీ లోపం.. హ్యాకర్లు మీ వాట్సాప్‌ను సులభంగా హ్యాక్‌ చేస్తారు జాగ్రత్త..!

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంటోంది.ఇతర ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌లు కూడా వాట్సాప్‌ దెబ్బకు తట్టుకోలేకపోతున్నాయి.

 Security Defect In Whatsapp-TeluguStop.com

అయితే ఎన్ని ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నప్పటికీ వాట్సాప్‌లో ఎప్పుడూ ఏదో ఒక సెక్యూరిటీ లోపం బయటపడుతూనే ఉంది.మరి తాజాగా అందులో బయటపడిన సెక్యూరిటీ లూప్‌హోల్‌ ఏమిటో తెలుసా.? హ్యాకర్లు వాట్సాప్‌ వాయిస్‌ మెయిల్‌ ద్వారా సులభంగా యూజర్లకు చెందిన వాట్సాప్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేయగలుగుతారట.ఇదే విషయాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన ఓ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ తాజాగా వెల్లడించింది.

సాధారణంగా మనం ఫోన్‌ చేంజ్‌ చేసినా లేదంటే.వాట్సాప్‌ను రిమూవ్‌ చేసి మళ్లీ ఇన్‌స్టాల్‌ చేసినా ఫోన్‌ నంబర్‌ వెరిఫికేషన్‌ను ముందుగా అడుగుతుంది.ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేశాక దానికి వచ్చే ఓటీపీని వాట్సాప్‌లో కన్‌ఫాం చేస్తేనే అకౌంట్‌ వెరిఫై అవుతుంది.దాంతో యూజర్‌ మళ్లీ తన వాట్సాప్‌ యాప్‌ సేవలను ఉపయోగించుకోవచ్చు.

అయితే ఇదే విధానం హ్యాకర్లకు వరంగా మారింది.ఎలా అంటే.

యూజర్‌ ఫోన్‌ నంబర్‌తో హ్యాకర్లు వాట్సాప్‌ ఓటీపీ వచ్చేలా చేస్తారు.దాన్ని కన్‌ఫాం చేయాల్సి ఉంటుంది.

కానీ కోడ్‌ వారి వద్ద ఉండదు కనుక.వారు కొంత సేపు ఆగి వాయిస్‌ మెయిల్‌ కాల్‌కు వెళ్తారు.

సాధారణంగా ఓటీపీ కన్‌ఫాం చేయకపోతే వెంటనే వాయిస్‌ కాల్ ద్వారా ఓటీపీని వాట్సాప్‌ మనకు అందిస్తుంది.అనంతరం దాన్ని కూడా ఆన్సర్‌ చేయకపోతే అప్పుడు అది వాయిస్‌ మెయిల్‌కు వెళ్తుంది.

అలా వాయిస్‌ మెయిల్‌కు వెళ్లిన కాల్‌ ద్వారా హ్యాకర్లు ఓటీపీ తెలుసుకుని దాంతో యూజర్‌ వాట్సాప్‌ను వెరిఫై చేస్తారు.ఇంకేముందీ.

యూజర్‌కు చెందిన వాట్సాప్‌ అకౌంట్‌ ఓపెన్‌ అవుతుంది.దాంతో అందులో ఉండే వివరాలన్నింటినీ హ్యాకర్లు తస్కరిస్తారు.

ప్రస్తుతం ఇదే సెక్యూరిటీ లోపం వాట్సాప్‌ యూజర్లకు ఆందోళన తెప్పిస్తున్నది.

అయితే ఈ లోపానికి విరుగుడు లేదా.అంటే ఉంది.అందుకు ఏం చేయాలంటే.

యూజర్లు తమ వాట్సాప్‌ యాప్‌కు 2 స్టెప్‌ వెరిఫికేషన్‌ పెట్టుకోవాలి.అకౌంట్స్‌లో ఉండే సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్‌ కనిపిస్తుంది.2 స్టెప్‌ వెరిఫికేషన్‌ పెట్టుకుంటే వాట్సాప్‌ యాప్‌లోకి లాగిన్‌ అయిన ప్రతిసారి యూజర్‌కు 6 డిజిట్ల పిన్‌ నంబర్‌ వస్తుంది.దీంతో యాప్‌లోకి లాగిన్‌ అవచ్చు.

అయితే 2 స్టెప్‌ వెరిఫికేషన్‌ ఉంటే.హ్యాకర్‌కు మన వాట్సాప్‌లోకి లాగిన్‌ అవడం కుదరదు.

కనుక మన వాట్సాప్‌ అకౌంట్‌ సేఫ్ గా ఉంటుంది.ఇలా వాట్సాప్‌ను మనం సురక్షితంగా ఉంచుకోవచ్చు.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube