ప్రారంభం అయిన సికింద్రాబాద్,‌ కాగజ్‌నగర్‌ ఇటర్‌సిటీ రైలు.. !

గత సంవత్సరం దేశంలో జరిగిన కరోనా వ్యాప్తి వల్ల రవాణ వ్యవస్ద అంతా కుంచించుకుపోయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ఎన్నో ట్రైన్స్ క్యాన్సిల్ చేసింది రెల్వేశాఖ.

 Secunderabad Kagaznagar Intercity Express Service Starts From Today  Secunderaba-TeluguStop.com

కొన్ని ముఖ్యమైన ట్రైన్స్ పరిమిత సంఖ్యలో మాత్రమే నడుపుతుంది.దీని వల్ల ప్రస్తుతం ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులు చాలా ఉన్నాయి.

ఇకపోతే ఇలా క్యాన్సిల్ చేయబడిన రైళ్లల్లో సికింద్రాబాద్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఇంటర్‌సిటీ రైలు ఒక్కటి.అయితే తాజాగా ఈ రైలును ప్రారంభిస్తున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు.ఇకపోతే మంచిర్యాల జిల్లాల నుంచి సికింద్రాబాద్‌కు నేటి నుండి ప్రారంభం కానుందని పేర్కొంటున్నారు.

ఆ సమయాన్ని చూస్తే.ప్రతిరోజు ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 4.50 గంటలకు బయలుదేరి ఉదయం 9.12 గంటలకు మంచిర్యాలకు, 10.55 గంటలకు కాగజ్‌నగర్‌కు చేరుకుంటుంది.తిరిగి 11.55 గంటలకు కాగజ్‌నగర్‌లో ప్రారంభం అయ్యి మధ్యాహ్నం 12.56 గంటలకు మంచిర్యాలకు, సాయంత్రం 5.55 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.కాబట్టి ఈ మార్గంలో వెళ్లే వారు కోవిడ్ నిబంధలను పాటిస్తూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలియచేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube