సికింద్రాబాద్: రైళ్లలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసారు సికింద్రాబాద్ జిఆర్పీ పోలీసులు.ఇద్దరు మహిళలతోపాటు మొత్తం ఐదు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు వారి నుండి 37 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
జిఆర్పీ డిఎస్పీ చంద్రభాను మాట్లాడుతూ ప్రత్యేక తనిఖీ లలో భాగంగా ప్లాట్ ఫారం 10లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ ముఠాను గుర్తించి ప్రశ్నించగా ఎల్టీటి రైల్ లో విశాఖపట్నం నుండి ముంబయికి గంజాయి తరలిస్తున్న విషయం తెలిసిందని తెలిపారు.వెంటనే ఇద్దరు మహిళలతో పాటు మొత్తం 5 మందిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.
వారి నుండి 3 లక్షల 80 వేల విలువైన గంజాయుని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.అయితే తమ విచారణలో వీరు సులభంగా అత్యధికంగా సంపాదించాలనే ఉద్దేశ్యంతో గంజాయిని తక్కువ ధరకు వెయ్యి, పదిహేను వందలకు కిలో కొని ముంబాయిలో డిమాండ్ ను బట్టి వేల నుండి 20వేల వరకు కిలో చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి అమ్ముతున్నట్లు తేలిందని వెల్లడించారు.
రైళ్లలో ఎటువంటి అక్రమ కార్యకలాపాలను సహించమని తెలిపారు.రైళ్లలో అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.