సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభ్యర్థి పేరును బీజేపీ ప్రకటించింది.ఈ మేరకు బీజేపీ అభ్యర్థిగా టీఎన్ వంశా తిలక్( Vamsha Tilak ) పేరును వెల్లడించింది.
తెలంగాణ, యూపీలలో త్వరలో జరగబోయే ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల లిస్టును బీజేపీ విడుదల చేసింది.ఇందులో భాగంగానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించింది.
అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేశ్ కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నారు.కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన లాస్యనందిత( Lasya Nanditha ) కారు ప్రమాదంలో మృతిచెందారు.దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదితను బీఆర్ఎస్ టికెట్ ను కేటాయించగా.ఇటీవల చేరిన శ్రీగణేశ్ కు కాంగ్రెస్ కు కేటాయించింది.తాజాగా బీజేపీ సైతం అభ్యర్థిని ప్రకటించింది.