బాహుబలి యాక్టర్ల బొట్టు వెనుక అసలు సీక్రెట్ ఇదే..?

మామూలుగా సినిమాలలో పాత్రల గురించి మాట్లాడుకుంటాం ఇంకా అందులో సెట్ ల గురించి మాట్లాడుకుంటాం.అంతేకాకుండా సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం.

 Secrets Behind Bahubali Actors Bottu In Movie-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈసారి కొత్తగా బాహుబలి సినిమాలో యాక్టర్ ల బొట్టుల గురించి తెలుసుకుందాం.ప్రపంచవ్యాప్తంగా భారీ బడ్జెట్ తో మంచి విజయాన్ని అందుకున్న పాన్ ఇండియా మూవీ బాహుబలి.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా అద్భుత విజయాన్ని అందించింది.ఈ సినిమాలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, తమన్నా, అనుష్క పాత్రలు బాగా ఆకట్టుకోగా ఇందులో వీళ్లు పెట్టుకున్న బొట్టు ల గురించి ఓ ప్రత్యేకత ఉందని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

 Secrets Behind Bahubali Actors Bottu In Movie-బాహుబలి యాక్టర్ల బొట్టు వెనుక అసలు సీక్రెట్ ఇదే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ ఆ బొట్టుల గురించి తెలుసుకుందాం.

Telugu Bahubali Actors, Blob, Prabahas, Tollywood-Movie

బిజ్జల దేవుడు పాత్ర లో నటించిన నాజర్.ఈయన త్రిశూలం బొట్టు పెట్టుకున్నాడు.ఇందులో మనుషుల్లో ఉండే సత్వ, రజో, తామస అనే మూడు గుణాలలో తామస గుణాన్ని కలిగి ఉంటాడు.

ఈ గుణం అర్థం అసమతుల్యత, రోగం, గందరగోళం, తొందరపాటు, మోసం, అసూయ, ద్వేషం వంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం.ఈ గుణాల తోనే ఈ పాత్రలో నటించాడు నాజర్.

ఇక శివగామి పాత నటించిన రమ్య కృష్ణ.ఈమె పూర్తి చంద్రుడిని బొట్టుగా పెట్టుకుంది.

ఈ బొట్టు అర్థం ధైర్యం, సాహసోపేత నిర్ణయాలు, భద్రత, ఆప్యాయత, అనురాగం, ప్రేమ వంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం.

ఇక అమరేంద్ర బాహుబలి పాత్రలో నటించిన ప్రభాస్ సగం చంద్రుడు బొట్టు పెట్టుకుంటాడు‌.

దీనికి అర్థం పూర్తిగా శివగామి వంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటమే కాకుండా.ప్రజల పట్ల కరుణ, జాలి, ప్రశాంతమైన మనస్సు వంటి గుణాలను కలిగి ఉండడం.

దేవసేన పాత్రలో నటించిన అనుష్క పెట్టుకున్న బొట్టు కు అర్థం ఆడ, మగ ఇద్దరూ సమానమే అని, లింగ వివక్షత చూపరాదని వ్యక్తిత్వంతో కలిగి ఉండటం.ఇందులో అనుష్క ఇదే పాత్రతో బాగా ఆకట్టుకుంది.

భల్లాల దేవా పాత్రలో నటించిన రానా సూర్యుని బొట్టు పెట్టుకున్నాడు.దీని అర్థం ఎన్ని కోట్ల సంవత్సరాలైనా సూర్యుడు ఓకే గుణాన్ని కలిగి ఉంటాడు.ఎటువంటి మార్పు ఉండదు.బలం, రాజసం కలిగి ఉంటాడు.కాబట్టి పాత్రలో రానా బాగా సెట్ అయ్యాడు.

Telugu Bahubali Actors, Blob, Prabahas, Tollywood-Movie

మహేంద్ర బాహుబలి అనే మరో పాత్రల్లో నటించిన ప్రభాస్ శంకువులో చిక్కుకున్న పాము బొట్టు పెట్టుకున్నాడు.దీని అర్థం మంచి ప్రేమ, బలం, అందర్నీ శాసించే ధైర్యం వంటి గుణాలను కలిగి ఉంటారు.

Telugu Bahubali Actors, Blob, Prabahas, Tollywood-Movie

కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ బొట్టుకి అర్థం బానిసత్వాన్ని కలిగి ఉండటం.నిస్సహాయత సంకేతం.బాహుబలిలో కట్టప్ప పాత్ర మరో ఎత్తు.

Telugu Bahubali Actors, Blob, Prabahas, Tollywood-Movie

అవంతిక పాత్రలో నటించిన తమన్నా.ఆమె పెట్టుకున్న బొట్టు ప్రతీకారం కోసం అర్థం.ప్రతీకారం కోసం ఒక ఆయుధం గా మారిన గుణాన్ని కలిగి ఉండటం.

#Bahubali Actors #Blob #Prabahas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు