టబు గురించి ఎవరికి తెలియని రహస్యాలు ఇవే!

ఎవర్ గ్రీన్ బ్యూటీ.హైద‌రాబాద్ లో పుట్టి ముంబైలో సెటిలైన బాలీవుడ్ బామ్మ‌.వ‌యస్సు మీద ప‌డుతున్న త‌ర‌గ‌ని అందం, అభినయంతో బాలీవుడ్ లో దూసుకెళ్తుంది ట‌బు అసలు పేరు తబుస్సుమ్ హష్మి.1971 నవంబరు 4న హైదరాబాదీ‌ ముస్లిం కుటుంబంలో జ‌న్మించిన ట‌బు.1980లో బాల‌న‌టిగా బ‌జార్ చిత్రంలో యాక్ట్ చేసింది.అయితే బాల్యంలో త‌న త‌ల్లిదండ్రులు విడిపోవ‌డంతో 1983లో త‌న మేన‌త్త, ప్రముఖ నటి షబానా అజ్మీ వ‌ద్ద‌కు హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లింది.

 Unknown Facts About Tabu, Heroine Tabu, Real Life Secreats, Tollywood, Bollywood-TeluguStop.com

అలా ముంబైకి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ ఆ త‌రువాత హమ్ నే జవాన్స‌, రూప్‌కీ రాణీ చోరోంకా రాజా , ప్రేమ్ సినిమాల‌లో యాక్ట్ చేసింది.ప్రేమ్ చిత్రం పూర్తి కావడానికి సుమారు ఎనిమిదేళ్లు పట్టింది.

సుదీర్ఘకాలం తర్వాత విడుదలైనా, ఆ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.

Telugu Ajaydevagan, Bollywood, Tabu, Secreats, Tollywood-Movie

హిందీలో ఎలా ఉన్నా హీరోయిన్ గా టబు టాలీవుడ్ పై చెరగని ముద్ర వేసింది.చేసింది తక్కువ సినిమాలే అయినా, టబు అనగానే తెలుగు ప్రేక్షకులు మా హీరోయిన్నే అంటుంటారు.కూలీ నెంబర్ 1,నిన్నే పెళ్లాడతా, చెన్నకేశవరెడ్డి , ఆవిడా మా ఆవిడే , అందరివాడు , పాండురంగడు , ఇదీ సంగతితో పాటు రీసెంట్ గా వ‌చ్చిన అల వైకుంఠ‌పురంలో అల్లు అర్జున్ కు త‌ల్లిగా న‌టించి మెప్పించింది.

ముఖ్యంగా నిన్నే పెళ్లాడ‌తా సినిమాలో నాగార్జున, ట‌బుల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది.ఇప్ప‌టికీ టబు కెరియ‌ర్ లో ఎవ‌ర్ గ్రీన్ సినిమా నిలిచిపోతుంది.ఈ సినిమా నుంచే తాను అందం , అణుకువ‌, టైమ్ పంక్చువాలిటీ నేర్చుకున్నాన‌ని అంటారు ట‌బు.

సినిమా అనేది అదో రంగుల ప్రపంచం.

కానీ ఆ రంగుల వెనుక న‌టీన‌టుల జీవితాలు ఎంతో ధీనంగా ఉంటాయో మ‌న‌కు తెలియంది.ఇక ట‌బు జీవితం కూడా అంతే.

వ‌య‌స్సు మీద ప‌డుతున్నా ఆమె ఇంత‌ర‌వ‌కు ఎవ‌ర్ని వివాహం చేసుకోలేదు.దీనికి కార‌ణం బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ గ‌ణ్ అని అంటుంటారు.

Telugu Ajaydevagan, Bollywood, Tabu, Secreats, Tollywood-Movie

అజ‌య్ దేవ‌గ‌ణ్, ట‌బు అన్న‌య్య స‌మీర్ మంచి స్నేహితులు.అజ‌య్ దేవ‌గ‌ణ్ నా‌కు 13,14ఏళ్ల నుంచే తెలుసు.స‌మీర్, అజ‌య్ లు క‌లిసి న‌న్ను ఎవ‌రైనా ఏడిపిస్తుంటే కొట్టేవారు.ఆ ర‌కంగా అజ‌య్ నా వెంట ఎవ‌రు ప‌డ‌కుండా చేశాడు.నా స్నేహితులు పెళ్లి చేసుకుంటే నేను మాత్రం ఇంత వ‌ర‌కు పెళ్లి చేసుకోలేద‌ని న‌వ్వుతూ చెబుతోంది.‌

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube